Chiranjeevi Indirect Counter to Garikapati Narasimharao
Chiranjeevi : ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకుడు దత్తాత్రేయ ఇచ్చిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి అతిధులుగా వచ్చేసారు. ఆ సభలో గరికపాటి మాట్లాడాల్సిన సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి అక్కడున్న మహిళలు ఎగబడ్డారు. దీంతో గరికపాటి.. మీరు ఫోటోలు దిగడం ఆపకపోతే నేను వెళ్ళిపోతాను అంటూ అనడంతో ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదంగానే మారాయి.
మెగాస్టార్ కి సపోర్ట్ గా చాలా మంది అభిమానులు, ప్రముఖులు గరికపాటిని బహిరంగంగానే విమర్శించారు. ఈ వివాదం కొన్ని రోజుల పాటు సాగింది. గరికపాటి మెగాస్టార్ కి క్షమాపణలు చెప్పినా కొంతమంది వదలకుండా గరికపాటిని విమర్శించారు. కొన్ని రోజుల తర్వాత చిరంజీవి దీనిపై స్పందించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
BiggBoss 6 Day 54 : ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసా ?? కెప్టెన్ గా పని మొదలుపెట్టిన శ్రీహాన్..
తాజాగా శుక్రవారం ఓ పుస్తకం లాంచింగ్ ఈవెంట్ జరగగా దానికి చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కూడా ఈవెంట్ అయ్యాక కొంతమంది మహిళలు చిరంజీవితో ఫోటో దిగడానికి వచ్చారు. అక్కడున్న మహిళలంతా చిరంజీవిని చుట్టుముట్టారు. దీంతో ఆ సన్నివేశాన్ని చూసి చిరంజీవి.. ఇప్పుడు ఇక్కడ వారు లేరు కదా అని ఇండైరెక్ట్ గా గరికపాటికి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆయన అన్నది గరికపాటినే అని అర్థమయి అక్కడున్న వాళ్లంతా అరుపులు, కేకలతో హడావిడి చేశారు. ఇండైరెక్ట్ గా మరోసారి గరికపాటికి గుర్తుచేయడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.