×
Ad

Chiranjeevi : పవన్ కళ్యాణ్ కే ఆ సమర్థత ఉంది.. రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. చిరంజీవి కామెంట్స్ వైరల్..

దావోస్ పర్యటన, పాలిటిక్స్ గురించి ప్రస్తావన రాగా చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Chiranjeevi)

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లి పలు కారణాలతో రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కానీ అన్ని పార్టీల నేతలతో సన్నిహితంగా ఉంటారు ఇప్పటికి. ఇటీవల దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో కూడా కలిసి కనిపించారు మెగాస్టార్.(Chiranjeevi)

తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తర్వాత మీడియాలోని కొంతమంది సీనియర్ జర్నలిస్టులతో చిరంజీవి మాట్లాడారు. ఈ క్రమంలో దావోస్ పర్యటన, పాలిటిక్స్ గురించి ప్రస్తావన రాగా చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Anjali : భర్త కంటే ఎక్కువ ఫేమ్ వచ్చేసిందని యాక్టింగ్ మానేసిన హీరో భార్య.. ఒకప్పటి ఈ హీరోని గుర్తుపట్టారా?

చిరంజీవి మాట్లాడుతూ.. ఇటీవల నేను దావోస్ వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగింది. నేను వెకేషన్ కి అటు వెళ్ళాను. నా మిత్రులు అంతా అక్కడ ఉండటంతో ఇండస్ట్రీ తరపున ఉండమని అడిగారు. దాంతో నేను కాదనలేక వెళ్ళాను. అంతే కానీ నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నాకు అన్ని పార్టీల నేతలు మిత్రులే. సినిమా, రాజకీయం రెండు రంగాలను నెట్టుకురావడం నాకు సాధ్యం కాలేదు. పవన్ కళ్యాణ్ కు ఆ సమర్థత ఉందని అన్నారు.

దీంతో చిరు కామెంట్స్ వైరల్ గా మారగా పవన్ ఫ్యాన్స్, జనసైనికులు ఈ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు.

Also See : Sravanthi Chokarapu : పసుపు చీరలో యాంకర్ స్రవంతి పరువాలు.. ఫొటోలు వైరల్..