Kodama Simham Re Release Trailer : చిరంజీవి ‘కొదమ సింహం’ రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది..
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీల్లో కొదమసింహం (Kodama Simham Re Release Trailer) ఒకటి.
Chiranjeevi Kodama Simham Re Release Trailer out now
Kodama Simham Re Release Trailer : మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీల్లో కొదమసింహం ఒకటి. రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్‌లు కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించారు.
కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1990 ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదలై 35 సంవత్సరాలు పూరైన క్రమంలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నాగేశ్వరరావు విజయదశమి సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు నవంబరు 21న తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
