Chiranjeevi Kodama Simham Re Release Trailer out now
Kodama Simham Re Release Trailer : మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీల్లో కొదమసింహం ఒకటి. రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్‌లు కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించారు.
కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1990 ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదలై 35 సంవత్సరాలు పూరైన క్రమంలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నాగేశ్వరరావు విజయదశమి సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు నవంబరు 21న తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.