Tfi
Chiranjeevi : ఏపీలో సినిమా టికెట్ ధరల సమస్య రోజూ చర్చల్లో ఉండటంతో తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మెగాస్టార్ చిరంజీవిని ఫోన్ చేసి లంచ్ కి ఆహ్వానించారు. లంచ్ తర్వాత ఇండస్ట్రీ సమస్యల్ని, థియేటర్ సమస్యల్ని, టికెట్ రేట్లపై ఇండస్ట్రీ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇవన్నీ వివరంగా జగన్ కి చెప్పారు చిరంజీవి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… ”జగన్ గారు నేను చెప్పిన సినీ పరిశ్రమలోని సమస్యల్ని విన్నారు. త్వరలో వాటిపై అందరికి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటాను అని అన్నారని, అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చి చెప్పమన్నారు. ఈ నెలాఖరు లోపు ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది” అని చిరంజీవి మీడియాకి తెలిపారు.
అలాగే ”నేను ఇండస్ట్రీ పెద్దగా జగన్ ని కలవలేదు. ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను. మీ అందరికి ఇండస్ట్రీ బిడ్డగా ఒకటే చెప్తున్నాను. ఎవరూ తొందరపడి అభద్రతా భావంతో మాటలు జారొద్దు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దు, స్టేట్మెంట్స్ ఇవ్వొద్దు. కొన్ని రోజులు సంయమనం పాటించండి. జగన్ గారు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారు. నేను అందరి తరపున మన సమస్యల్ని వివరించాను. ఈ మీటింగ్ లో ఏం జరిగింది, జగన్ గారు నాకు చెప్పినవన్నీ ఇండస్ట్రీ ప్రముఖులతో త్వరలో సమావేశం పెట్టి అందరికీ చెప్తాను. మీరు ఏమైనా సమస్యల్ని చెప్తే అవన్నీ విని మళ్ళీ జగన్ గారిని కలుస్తాను. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది” అని మీడియాతో తెలిపారు.
Chiranjeevi : ఇండస్ట్రీలో ఎవరు పడితే వాళ్ళు ఇష్టమొచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వకండి..
గతంలో కరోనా మొదటి వేవ్ సమయంలో కూడా చిరంజీవి, నాగార్జున కలిసి ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం పెట్టి సమస్యల్ని చర్చించారు. ఇప్పుడు చెప్పిన దాని బట్టి మళ్ళీ ఇండస్ట్రీ ప్రముఖులతో మరోసారి సమావేశం పెట్టనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అందరూ సంక్రాంతి హడావిడిలో ఉన్నారు కాబట్టి సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల్ని పిలిచి మీటింగ్ పెట్టి సినీ సమస్యలపై చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చర్చల అనంతరం చిరంజీవి మళ్ళీ జగన్ ని కలిసే అవకాశం ఉంది. ఈ చర్చలకు సీనియర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తో పాటు స్టార్ హీరోలు కూడా వచ్చే అవకాశం ఉంది.