Chiranjeevi Mega156 movie title script paper leaked
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన 156 సినిమాని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. బింబిసారా దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కబోతుందని దర్శకుడు ఇప్పటికే తెలియజేశాడు. ఇక ఈ సినిమా టైటిల్, కాస్టింగ్ సెలక్షన్ పై నెట్టింట అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ లీక్ అయ్యింది. స్క్రిప్ట్ పేపర్ కి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకి టైటిల్ ని ఏం ఫిక్స్ చేసారో తెలుసా..?
‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. ఇక ఈ టైటిల్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి వరుణ్ తేజ్ పెళ్లి హడావుడిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ హడావుడి పూర్తి అవ్వగానే చిరు కూడా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నాడని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో విలన్ గా రానా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి ఆ వార్త ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.
Also read : Vishwak Sen : విశ్వక్‌సేన్ వివాదం పై స్పదించిన నాగవంశీ.. ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ షూటింగ్ బ్యాలన్స్ ఉంది..
#MegastarChiranjeevi #Viswambhara @KChiruTweets pic.twitter.com/XPiGXw56jX
— Team Chiru Vijayawada (@SuryaKonidela) November 1, 2023
ఇక ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ పాటలు రాయనున్నారు. ఈ మూవీకి పని చేయబోయే మరికొంతమంది టెక్నీషియన్స్ అండ్ నటీనటులు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్ కి తగ్గ పాత్రలో కనిపించబోతున్నాడని దర్శకుడు ఇప్పటికే తెలియజేశాడు. చిరంజీవి నుంచి ఒక భారీ కమ్‌బ్యాక్ ఎదురు చూస్తున్న అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.