Chiranjeevi Nagababu went to Allu Arjun home
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు అయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే.. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖలు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. జరిగిన పరిణామాలపై చిరంజీవి ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. నటుడు నాగబాబు సైతం బన్నీ నివాసానికి చేరుకున్నారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. తొక్కిసలాటలో ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
Allu Arjun : గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు..
ఈ ఘటనకు సంబంధించి బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇక బన్నీ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యం పై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి#AlluArjun #Chiranjeevi
— Suresh PRO (@SureshPRO_) December 13, 2024