Chiranjeevi : మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలే.. ఈమె గురించి తెలుసా?

ఈ పాటని పాడింది ఎవరో కాదు చిరంజీవి మేనకోడలు. (Chiranjeevi)

Chiranjeevi : మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలే.. ఈమె గురించి తెలుసా?

Chiranjeevi

Updated On : January 20, 2026 / 9:33 PM IST
  • మన శంకర వరప్రసాద్ గారు సాంగ్స్
  • అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్
  • చిరంజీవి మేనకోడలు సింగర్ గా ఎంట్రీ

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండక్కి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాతో చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.(Chiranjeevi)

అయితే ఈ సినిమాలో చిరంజీవి తన పిల్లలతో స్కూల్ లో ఉండే కొన్ని సన్నివేశాల్లో ఒక పాప్ సాంగ్ వస్తుంది. ఈ పాటని పాడింది ఎవరో కాదు చిరంజీవి మేనకోడలు. ఈ విషయాన్ని ఇంతకుముందే అనిల్ రావిపూడి ప్రకటించాడు.

Also Read : Jabardasth Rajamouli : కరోనాతో చనిపోయేవాడ్ని.. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. రాజమౌళి ఎమోషనల్

మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఫ్లై హై అనే సాంగ్ కి సంబంధించిన వీడియో, ఆ పాట పాడిన సింగర్ తన గురించి చెప్తున్నా ఓ వీడియోని మూవీ టీమ్ షేర్ చేసారు. ఈ వీడియోలో ఒక అమ్మాయి మాట్లాడుతూ.. నా పేరు నైరా అని, ఈ పాట పాడింది నేనే అని, సింగపూర్ లోని లసలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుతుందని, ఒక పాప్ మ్యూజిక్ స్టూడెంట్ అని, ఈ సినిమాతో సింగర్ గా టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చానని తన గురించి తెలిపింది.

అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ అనిల్ రావిపూడి.. నైరా చిరంజీవి గారి మేనకోడలు. చిరంజీవి చెల్లి మాధవి గారి కూతురు. సినిమాలో ఫ్లై హై సాంగ్ చాలా బాగా పాడింది. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే తనకు ఇంకా చాలా మంచి జర్నీ ఉంది అని ట్వీట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Naveen Polishetty : వామ్మో నవీన్ పోలిశెట్టి రెమ్యునరేషన్ అంత పెంచేసాడా..? నాలుగు సినిమాలు హిట్ కొట్టగానే..

చిరంజీవికి ఇద్దరు చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి రావు. విజయ్ దుర్గ కొడుకులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ హీరోలు అని అందరికి తెలిసిందే. మాధవి రావు డాక్టర్. ఆమె డాక్టర్ గా పనిచేస్తూనే చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ ని చూసుకుంటుంది. ఈమె గురించి ఎక్కువగా ఎవరికీ తెలీదు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈమె పిల్లల గురించి అసలు ఎవరికీ తెలీదు. ఇప్పుడు నైరా ఈ మాధవి రావు కూతురు అని, చిరంజీవి మేనకోడలు అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

దీంతో నైరా మ్యూజిక్ నేర్చుకుంటుందని, త్వరలోనే సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి మరొకరు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.