Naveen Polishetty : వామ్మో నవీన్ పోలిశెట్టి రెమ్యునరేషన్ అంత పెంచేసాడా..? నాలుగు సినిమాలు హిట్ కొట్టగానే..
నవీన్ పోలిశెట్టి అంటే మినిమమ్ గ్యారెంటీ, కామెడీ కచ్చితంగా ఉంటుంది అని ప్రేక్షకులు, సినిమా లవర్స్ ఫిక్స్ అయిపోయారు. (Naveen Polishetty)
Naveen Polishetty
- వరుసగా నాలుగు హిట్స్
- హాట్ టాపిక్ గా మారిన నవీన్ పోలిశెట్టి
- రెమ్యునరేషన్ పెంచేసి
Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి.. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ హీరోగా ఎదిగాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టి ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్నాడు. జాతి రత్నాలు సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరోసారి సక్సెస్ కొట్టాడు.(Naveen Polishetty)
దీంతో నవీన్ పోలిశెట్టి అంటే మినిమమ్ గ్యారెంటీ, కామెడీ కచ్చితంగా ఉంటుంది అని ప్రేక్షకులు, సినిమా లవర్స్ ఫిక్స్ అయిపోయారు. ఇటీవల సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో నవీన్ పోలిశెట్టి తన నెక్స్ట్ సినిమాకు రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడని టాక్ వినిపిస్తుంది.
Also See : Divyabharathi : బాబోయ్ షార్ట్ స్కర్ట్ లో దివ్యభారతి హాట్ పోజులు..
నవీన్ పోలిశెట్టి అధికారికంగా తన నెక్స్ట్ సినిమాని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం పలువురు దర్శకులు, నిర్మాతలతో చర్చలు నడుస్తున్నాయి. అయితే నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సినిమాకు దాదాపు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడుగుతున్నట్టు టాలీవుడ్ టాక్. దీంతో ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నాలుగు సినిమాలు హిట్టవ్వగానే ఏకంగా 15 కోట్లు అడుగుతున్నాడా అని షాక్ అవుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో నవీన్ కే తెలియాలి.
అలాగే నవీన్ పోలిశెట్టి తన సినిమాల్లో రైటింగ్ స్టేజ్ దగ్గర్నుంచి కూర్చుని అన్నిట్లో వేలుపెడతాడని తెలిసిందే. ఈ విషయం నవీన్ స్వయంగా ఒప్పుకున్నాడు. బెటర్ అవుట్ పుట్ కోసం ఇన్వాల్వ్ అవుతానని చెప్పాడు. అలా నెక్స్ట్ సినిమాలో కూడా నవీన్ సినిమా మొదటి స్టేజి నుంచి అన్నిట్లో భాగమవుతాడట. యాక్టింగ్ మాత్రమే కాకుండా రైటింగ్, ప్రొడక్షన్ లో కూడా భాగమవుతాడు కాబట్టే అంత రెమ్యునరేషన్ అడుగుతున్నాడని సమాచారం. ప్రస్తుతం నవీన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి, చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది కాబట్టి అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీగానే ఉన్నారు.
Also Read : Jabardasth Rajamouli : నన్ను టీమ్ లీడర్ అవకుండా చేసింది వాళ్లిద్దరే.. జబర్దస్త్ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు..
