Jabardasth Rajamouli : నన్ను టీమ్ లీడర్ అవకుండా చేసింది వాళ్లిద్దరే.. జబర్దస్త్ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు..
తాజాగా జబర్దస్త్ రాజమౌళి దీనిపై స్పందిస్తూ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. (Jabardasth Rajamouli)
Jabardasth Rajamouli
Jabardasth Rajamouli : జబర్దస్త్ తో ఎంతోమంది ఆర్టిస్టులు ఫేమ్ తెచ్చుకున్నారు. చాలా మంది కమెడియన్లు టీవీ, సినీ పరిశ్రమలోకి వచ్చారు. జబర్దస్త్ లో మాములు ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది టీమ్ లీడర్ అయ్యారు. తాజాగా జబర్దస్త్ రాజమౌళి టీమ్ లీడర్ అవకాశంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.(Jabardasth Rajamouli)
ఎన్నో ఏళ్లుగా సినీ, టీవీ పరిశ్రమలో ఉన్న రాజమౌళి జబర్దస్త్ షోలో మందు తాగిన వ్యక్తిగా నటించి బాగా పాపులర్ అయ్యాడు. తనదైన పేరడీ సాంగ్స్ తో అందర్నీ నవ్వించి ఫేమ్ తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కి వచ్చి కూడా పదేళ్లు అవుతున్నా ఇంకా టీమ్ లీడర్ అవ్వలేదు. తాజాగా జబర్దస్త్ రాజమౌళి దీనిపై స్పందిస్తూ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు.
Also Read : Sobhita Dhulipala : రిలేషన్ షిప్ లో విబేధాలు, గొడవలు సహజం.. శోభిత ధూళిపాళ కామెంట్స్ వైరల్..
జబర్దస్త్ రాజమౌళి మాట్లాడుతూ.. నన్ను, జీవన్ ని కలిపి ఒకసారి టీమ్ లీడర్స్ చేసారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. అప్పుడు స్వీట్స్ కూడా పంచిపెట్టాము. అప్పటికి నేను ఆర్పీ టీమ్, జీవన్ వెంకీ టీమ్ లో కీలకంగా ఉన్నాము. మాకు టీమ్ లీడర్ ఇచ్చారని తెలిసి ఆర్పీ, వెంకీ డైరెక్టర్స్ దగ్గరకు వెళ్లి వాళ్లకు టీమ్ లీడర్స్ ఇస్తే మా టీమ్స్ డల్ అయిపోతాయి. మాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ దొరికేదాకా వాళ్ళకు ఇవ్వొద్దు అన్నారు. దాంతో మా టీమ్ లీడర్ పొజిషన్స్ ఆపేసి మళ్ళీ కంటెస్టెంట్స్ చేసారు.
తర్వాత నాగబాబు గారు వెళ్ళిపోయాక మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. కానీ అపుడు హెల్త్ బాగోక వద్దు అన్నాను. నాకు మొదటిసారి టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు పోగొట్టారని చాలా బాధేసింది. ఆ తర్వాత రిస్క్ తీసుకోకూడదు అనుకున్నా. పంచ్ ప్రసాద్ కి కూడా టీమ్ లీడర్ అయ్యాక హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. స్ట్రెస్ తీసుకోలేకపోయాడు. అది చూసి ఇంక నేను కూడా టీమ్ లీడర్ అవ్వకూడదు అనుకున్నా అని తెలిపాడు.
Also Read : Nilave : ‘వాలెంటైన్స్ డే’కి రాబోతున్న మ్యూజికల్ లవ్ డ్రామా ‘నిలవే’..
