Sobhita Dhulipala : రిలేషన్ షిప్ లో విబేధాలు, గొడవలు సహజం.. శోభిత ధూళిపాళ కామెంట్స్ వైరల్..
శోభిత ఓ ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Sobhita Dhulipala)
Sobhita Dhulipala
Sobhita Dhulipala : నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ తెలుగులో తన కొత్త సినిమాతో రాబోతుంది. శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రాచకొండ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘చీకటిలో’. ఈ సినిమా జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే చీకటిలో సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.(Sobhita Dhulipala)
చీకటిలో సినిమాలో శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రాచకొండ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శోభిత ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి, రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : Nilave : ‘వాలెంటైన్స్ డే’కి రాబోతున్న మ్యూజికల్ లవ్ డ్రామా ‘నిలవే’..
శోభిత ధూళిపాళ మాట్లాడుతూ.. చీకటిలో సినిమాలో చూపించిన రిలేషన్ షిప్ యాంగిల్ నాకు చాలా బాగా నచ్చింది. రియల్ లైఫ్ లో ఏ ఇద్దరు భాగస్వాములు కూడా ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉండరు. రిలేషన్ లో ఇద్దరి మధ్య విభేదాలు, గొడవలు సహజం. ఈ రియాలిటీని సినిమాలో మా పాత్రల ద్వారా చూపించాము. నేను డైరెక్ట్ తెలుగులో నటించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు చీకటిలో సినిమాతో వస్తున్నాను. నా రోల్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది అని తెలిపింది.
రియల్ రిలేషన్ షిప్స్ లో గొడవలు సహజమే అని శోభిత వ్యాఖ్యలు వైరల్ అవ్వగా నిజమే కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శోభిత 2024 డిసెంబర్ లో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఈ జంట కలిసి కనిపించి సందడి చేసారు.
Also Read : Balakrishna : నా పరువు నిలబెట్టావు.. శర్వానంద్ ని అభినందించిన బాలయ్య.. ఎందుకో తెలుసా?
