Chiranjeevi prank with urvashi rautela
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ నిన్న రాత్రి మీడియా విలేఖర్లతో సమావేశం ఏర్పాటు చేసింది.
Chiranjeevi : పవన్‌కి ఖాళీ ఉండాలిగా.. పవన్ తో సినిమాపై మరోసారి చిరంజీవి వ్యాఖ్యలు..
ఈ ప్రెస్ మీట్‌లో చిరంజీవి, రవితేజ, రాజేంద్రప్రసాద్, దర్శకుడు బాబీ, దేవిశ్రీప్రసాద్, ఊర్వశి రౌతేలా, ఫైట్ అండ్ డాన్స్ మాస్టర్స్, నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యింది. ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరు గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా గురించి కూడా మాట్లాడుతూ చిరు చేసిన పని అందర్నీ నవ్వించింది.
“బాస్ పార్టీ సాంగ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఆ సాంగ్ కి ఎవర్ని పెడతారో ఏంటో అని అనుకున్నప్పుడు ఊర్వశి అన్నారు. ఇక ఊర్వశి కనబడ గానే మాటలు రాలేదు నాకు. చాలా బాగా చేసింది ఊర్వశి ఈ పాటలో” అంటూ ఊర్వశికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు చిరు. అయితే ఆ చెయ్యి వెనక్కి తీసుకునేటప్పుడు.. అతుక్కుపోయింది, ఆమె చేతి నుండి రావడం లేదు అని చిరు చేసిన పని అందర్నీ అలరించింది. ఈ కామెడీ టైమింగ్ తోనే చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
Chilipi boss?? #WaltairVeerayya pic.twitter.com/s3rnfiBdNj
— ?????? (@SaRath_Tweetss) December 27, 2022