Chiranjeevi : ఒడిశా రైలు ప్రమాదంపై చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి.. రక్తదానం చేయండి అంటూ అభిమానులకు పిలుపు..

ప్రమాదం జరిగిన చోట నిన్న రాత్రి నుంచే సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒడిశా ఘోర రైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు.

Chiranjeevi Reacted on Odisha Train Accident and call to blood donation

Odisha Train Accident :  ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 240కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ ప్రమాదంలో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఇంకా మృతులు, క్షతగాత్రులు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంది. ఈ రైలు ప్రమాదంపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన చోట నిన్న రాత్రి నుంచే సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒడిశా ఘోర రైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రుల్లో జాయిన్ చేయడంతో గాయపడిన వారి కోసం రక్తదానం చేయడానికి పలువురు ముందుకొచ్చి హాస్పిటల్స్ వద్ద రెడీగా ఉన్నారు. దీంతో తీవ్ర గాయాలతో రక్తం పోయిన వారికి దాతల నుంచి రక్తం తీసుకొని ఎక్కిస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది.

PM Modi : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి .. మృతుల కుటుంబాలకు సానుభూతి

ఈ రైలు ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చిరంజీవి తన ట్వీట్ లో.. రైలు ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాల రోదనలు వింటుంటే నా హృదయం ఎంతో బరువెక్కిపోయింది. ఈ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం అవసరమని అర్థమవుతుంది. రక్తదానం చేసేందుకు సమీప ఆస్పత్రుల వద్ద అభిమానులు, దగ్గర్లో ఉన్న ప్రజలు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.