Chiranjeevi : టాలీవుడ్ లో ఫిలిం ఫెడరేషన్ సినీ కార్మికులకు ఏకంగా 30 శాతం వేతనాలు పెంచాలని, లేకపోతే షూటింగ్స్ కి రాము అంటూ సమ్మె చేస్తున్నారు. దీంతో గత ఆరు రోజులుగా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత పెంపు సాధ్యం కాదు అని నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ చెప్తున్నారు. కావాలంటే 15 శాతం వరకు పెంచడానికి ట్రై చేస్తామన్నారు.
ఈ నేపథ్యంలో చిరంజీవిని ఇప్పటికే నిర్మాతలు కలిసి తమ బాధలు చెప్పుకొని పెంచడం సాధ్యం కాదని తెలిపారు. తాజాగా చిరంజీవిని ఫిలిం ఫెడరేషన్ కార్మికులు కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు.
Also Read : Tollywood Strike : టాలీవుడ్ సమ్మె.. ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాదయాత్ర..
ఈ మీటింగ్ లో చిరంజీవి.. సోమవారం వరకు ఈ వేతనాల పెంపు సమస్య తీరకపోతే నా సినిమాకు సోమవారం నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని తెలిపినట్టు సమాచారం.
అయితే నిన్న ఫిలిం ఛాంబర్ ఏ నిర్మాతలు దీనిపైనా నిర్ణయం తీసుకోవద్దు, షూటింగ్స్ కి వెళ్లొద్దు అని ఆదేశాలు జారీ చేసారు. ఇప్పుడు చిరంజీవి తన సినిమాకు పెంచుతామని చెప్పడంతో ఫిలిం ఛాంబర్, నిర్మాతల్లో చర్చ మొదలైంది. నిర్మాతలు అంతా దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు చిరంజీవి పెంచి ఇస్తానని ఫిలిం ఫెడరేషన్ వాళ్లకు చెప్పడంతో టాలీవుడ్ లో ఏం జరగనుందో అని ఆసక్తి నెలకొంది.
Also Read : Mahesh Babu : పవన్ లాగే మహేష్.. SSMB29 పోస్టర్.. మహేష్ మెడలో ఉన్న లాకెట్ ఏంటి..? శివుడి బ్యాక్ డ్రాప్ లో..