Chiranjeevi : రాజకీయాలు.. రాజకీయ నాయకుల గౌరవాన్ని పెంచారు.. అద్వానీ భారతరత్నకు అర్హులు.. చిరంజీవి ట్వీట్

అద్వానీకి భారతరత్న రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అందుకు నిస్సందేహంగా అద్వానీ అర్హులు అంటూ ట్వీట్ చేశారు.

Chiranjeevi

Chiranjeevi : బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్నకు ఎంపిక కావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. నిస్సందేహంగా అద్వానీ భారతరత్నకు అర్హులు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

LK Advani : ఎల్‌కే అద్వానీని వరించిన భారతరత్న

భారతదేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఎల్‌కే అద్వానీని వరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అద్వానీకి భారతరత్న రావడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా అద్వానీకి దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అద్వానీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

చిరంజీవి తన ట్వీట్‌లో ‘భారతరత్న నిస్సందేహంగా శ్రీ ఎల్‌కే అద్వానీజీకి ఎంతో అర్హమైన గౌరవం. మన దేశంలోని అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. స్వాతంత్ర్యానికి పూర్వం మరియు అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనది. అద్వానీ వంటి దిగ్గజాలు రాజకీయాలతోపాటు రాజకీయ నాయకుల స్థాయిని, గౌరవాన్ని పెంచారు. శ్రీ అద్వానీ గారికి హృదయపూర్వక అభినందనలు’ అంటూ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Komatireddy Venkat Reddy : చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి సత్కారం.. భారతరత్న కూడా రావాలని

అద్వానీ 15 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్‌లో చేరి ఇంజనీరింగ్ చదువుకూడా మానేసి పూర్తిగా దేశ రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అద్వానీ చేపట్టిన రథయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ప్రణాళిక ప్రకారం రథయాత్ర పూర్తి కాకపోయిన అద్వానీకి విపరీతమైన ప్రజాదరణ లభించింది. అద్వానీకి భారతరత్న రావడంపై దేశ వ్యాప్తంగా  ప్రముఖులు స్పందిస్తున్నారు. నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.