Chiranjeevi : అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి.. DAV స్కూల్ ఘటనపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..

DAV స్కూల్ ఘటనపై చిరంజీవి స్పందిస్తూ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో.. ''నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన ‍అత్యాచారం, అఘాయిత్యం నన్ను బాగా కలిచివేసింది. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు................

Chiranjeevi :  హైదరాబాద్‌ బంజారాహిల్స్ లోని DAV పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ఘటనపై బాధ్యులైన వారిని అరెస్ట్ చేశారు. దీనిపై సాధారణ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా సీరియస్ గా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

BiggBoss 6 Day 51 : కెప్టెన్సీ టాస్క్ కోసం ఒకరి మీద ఒకరు పడిపోయి.. తిట్లతో, అరుపులతో దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌజ్..

DAV స్కూల్ ఘటనపై చిరంజీవి స్పందిస్తూ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో.. ”నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన ‍అత్యాచారం, అఘాయిత్యం నన్ను బాగా కలిచివేసింది. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వం అన్ని విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను” అని తెలిపారు. దీంతో చిరంజీవి చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు