Chiranjeevi responds to Tamil Nadu's Karur accident
Karur Rally: తమిళనాడులోని కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ హీరో విజయ్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది మరణించినట్టు సమాచారం.(Karur Rally) చాలా మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Lenin: అబ్బా సాయి రామ్.. హీరోయిన్ ని మార్చేశారు.. అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
“తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాట విషాదకరం. ఈ ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవితో పాటు చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Deeply saddened by the tragic stampede at the rally in Karur, Tamil Nadu.
My sincere condolences to the families who are living through this unbearable loss. I wish them strength in this difficult time and pray for the speedy recovery of those injured.
Om Shanti 🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025