Chiranjeevi says about an interesting thing in his Childhood
Chiranjeevi : నేడు ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లి అంజనమ్మతో చిరంజీవి, నాగబాబు, మాధవి, విజయ దుర్గ.. లతో మెగా వుమెన్ అని స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి చిన్నప్పటి సరదా సంఘటన ఒకటి పంచుకున్నారు.
Also Read : Anudeep – Suma : ‘అనుదీప్’ మళ్లొచ్చిండు.. సుమ షోలో ఈ సారి మరింత కామెడీ.. ప్రోమో వైరల్..
చిరంజీవి మాట్లాడుతూ.. ఈ విషయం మా మామయ్య చెప్పారు. నేను మూడేళ్లప్పుడు పాక్కుంటూ బయటకు వెళ్ళిపోయా. కొన్ని ఇల్లు దాటుకొని వెళ్ళిపోయా. ఒకతను చూసి ఒక చోట కుర్చోపెట్టాడు. నేను ఏడుస్తూనే ఉన్నాను. మా అమ్మ వెతుక్కుంటూ అందర్నీ నా గురించి అడుగుతూ వచ్చింది. నేను ఉన్న దగ్గరికి వచ్చి అడిగితే నన్ను చూపించారు. నేను ఏడుస్తూ ఉన్నాను. నన్ను చూసి ఈ బాబు కాదు అనేసింది అంట. నేను అక్కడ కుమ్మరి ఇంట్లో పని చేసే దగ్గర కుర్చోపెట్టడంతో అక్కడ మసి అంతా ఒంటికి, ఫేస్ కి పూసుకున్నాను. దాంతో అమ్మ నన్ను గుర్తుపట్టలేదట. మళ్ళీ వెనక్కి వెళ్లి వచ్చి సరిగ్గా చూసి ఇతనే అని దగ్గరికి తీసుకుంది. తర్వాత మా అమ్మ బిజీగా ఉంటే నాకు తాడు కట్టి దీనికన్నా కట్టేసేది ఎక్కడికి వెళ్లకుండా అని అన్నారు.