×
Ad

Mega 158: మెగా మూవీ కోసం డిఫరెంట్ టైటిల్.. ‘కాకా’ పాత్రలో చిరంజీవి

మెగాస్టార్ సినిమాకు(Mega 158) డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేయనున్న దర్శకుడు బాబీ కొల్లి.

Chiranjeevi seen as Kakaji in Mega 158 movie.

  • చిరు- బాబీ కాంబోలో మెగా 158
  • ‘కాకాజీ’ పాత్రలో మెగాస్టార్
  • ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింట్

Mega 158: మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లితో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్టుగా టీం ఇటీవలే ప్రకటన చేశారు. ఇప్పటికే, ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అవడంతో ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.

ఇక చిరు- బాబీ కాంబోలో ఇప్పటికే వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. అందుకే, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే, ఈ సినిమాకు మేకర్స్ ‘కాకాజీ(Mega 158)’ అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేయాలని చూస్తున్నారట.

Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ వచ్చేది అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన టీం

ఇక చిరంజీవి కూడా గతంలో ఎన్నడూ కనిపించనంత కొత్తగా ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. కలకత్తా బ్యాక్డ్రాప్ లో కనిపించే మాఫియా డాన్ పాత్రలో చిరు కనిపించనున్నాడని సమాచారం. అందుకే, ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే పవర్ ఫుల్ అండ్ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేయాలనీ చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో చిరంజీవికి పెళ్ళై కూతురు కూడా ఉంటుందట.

ఇక భార్య పాత్రలో ప్రియమణి నటిస్తుండగా కూతురుగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి లేదా ఛాంపియన్ సినిమాలో నటించిన అనశ్వర రాజన్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇవన్నీ చేస్తుంటే మెగాస్టార్ కెరీర్ లో మరో భారీ హిట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక చిరు ప్రెజెంట్ సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆయన త్వరలో విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.