Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ వచ్చేది అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన టీం

నిఖిల్ సిద్దార్థ్ లేటెస్ట్ మూవీ 'స్వయంభు(Swayambhu)' మూవీ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీం.

Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ వచ్చేది అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన టీం

Nikhil Siddhartha Swayambhu movie new release date update.

Updated On : January 25, 2026 / 6:57 AM IST
  • నిఖిల్ ‘స్వయంభు’ వాయిదా
  • కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీం
  • ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి

Swayambhu: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభు(Swayambhu)’. పీరియాడికల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. నిఖిల్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా ఆ హైప్ ను పెంచేసింది.

Meenakshi Chaudhary: గ్లామర్ బ్యూటీ మీనాక్షి వయ్యారం.. నెటిజన్స్ దాసోహం.. ఫొటోస్

కనీసం టీజర్ కూడా ఈ సినిమా నుంచి విడుదల కాలేదు. జస్ట్ మేకింగ్ వీడియోస్ విడుదల చేసి ఈ రేంజ్ హైప్ ను తీసుకువచ్చారు అంటే మాములు విషయం కాదు. అందుకే, ఈ సినిమా కోసం చూస్తున్నారు ఆడియన్స్. అయితే, ఈ సినిమాలో గ్రాఫిక్స్, వీఎఫెక్స్ కి భారీ స్కోప్ ఉంది. అందుకే, ఆ అంశాలపై మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటి కారణంగానే సినిమా విడుదల వాయిదాల మీద వాయిదా పడుతోంది.

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. స్వయంభు సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, గ్రాఫిక్స్ వర్క్ కారణంగా వాయిదా పడింది. కేవలం ప్రేక్షకులకు అద్భుతమైన ఫీల్ ఇవ్వాలన్న ఆలోచనతోనే వాయిదా వేసినట్టు టీం తెలిపారు. మరి ఈ సినిమాకు విడుదల తరువాత ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.