Chiranjeevi Sensational Comments on Telugu Film Makers goes Viral
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నేడు సత్యదేవ్ జీబ్రా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో చిరంజీవి సినిమా గురించి, సత్యదేవ్ గురించి గొప్పగా మాట్లాడారు. అలాగే సత్యదేవ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
చిరంజీవి మాట్లాడుతూ.. బ్లఫ్ మాస్టర్ సినిమా చూసినప్పుడు సత్యదేవ్ నటన నచ్చి అతన్ని పిలిచి మాట్లాడాను. అతను నాకు ఎంత పెద్ద అభిమానో తెలిసి సంతోషిచాను. అతను మంచి నటుడైనా ఎందుకో ఛాన్సులు రావట్లేదు అనిపించింది. అతను హీరోగానే కాక వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు అనిపించింది. అందుకే నా వంతు సాయం నేను చేద్దామని గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ రోల్ ఆఫర్ చేశాను. గాడ్ ఫాదర్ సినిమాకు నార్త్ నుంచి, వేరే భాషల నుంచి వేరే హీరోలు తెద్దాం అనుకున్నారు. ఇక్కడ మన దగ్గర సత్యదేవ్ లాంటి మంచి పొటెన్షియల్ ఉన్న నటులు ఉన్నారు. కానీ మన వాళ్లకు మనవాళ్లే లోకువ అయిపోయారు. అందుకే వేరే భాషల నుంచి తెద్దామనుకుంటారు. నేను గట్టిగా చెప్పాను కాబట్టి సత్యదేవ్ ని పెట్టారు ఆ పాత్రలో. సత్యదేవ్ లాంటి వర్సటైల్ యాక్టర్స్ తెలుగులో కరువైపోయారు అని వ్యాఖ్యలు చేసారు.
దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తెలుగు డైరెక్టర్స్ మన సినిమాల్లో వేరే భాషల యాక్టర్స్ ని ఎక్కువగా తెస్తున్నారని, ఇక్కడ మంచి నటులు ఉన్నా పట్టించుకోవట్లేదు అని అర్ధం వచ్చేలా చిరంజీవి మాట్లాడటంతో టాలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. మరి దీనిపై ఎవరైనా మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి.