Daali Dhananjaya : చిరంజీవి పక్కన ఛాన్స్ మిస్ చేసుకున్న పుష్ప నటుడు.. వాల్తేరు వీరయ్యలో ఆ పాత్ర చేయాల్సింది కానీ..
నేడు జీబ్రా సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.

Kannada Star Daali Dhananjaya Comments on Chiranjeevi Waltair Veerayya Movie
Daali Dhananjaya : చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర వచ్చినా చేయడానికి రెడీ అంటారు ఆర్టిస్టులు. మెగాస్టార్ పక్కన ఛాన్స్ వస్తే ఎవ్వరూ వదులుకోరు. కానీ ఒక్కోసారి కొన్ని అనివార్య కారణాలతో అలాంటి మంచి ఛాన్సులు మిస్ అయిపోతూ ఉంటాయి. తాజాగా ఓ కన్నడ హీరో మెగాస్టార్ చిరంజీవి పక్కన ఛాన్స్ మిస్ అయింది అంటూ కామెంట్స్ చేసారు.
కన్నడ స్టార్ డాలి ధనుంజయ కన్నడలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా పలు సినిమాలు చేసిన ధనుంజయ పుష్ప సినిమాలో జాలి రెడ్డి పాత్రలో నెగిటివ్స్ షేడ్స్ తో అందర్నీ మెప్పించాడు. త్వరలో సత్యదేవ్ జీబ్రా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
Also Read : RajaSaab : హ్యారీ పోటర్ సినిమా వైబ్స్ వచ్చాయి.. రాజాసాబ్ సినిమాపై బాలీవుడ్ స్టార్ నిర్మాత కామెంట్స్..
నేడు జీబ్రా సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో డాలి ధనుంజయ మాట్లాడుతూ.. చిరంజీవి గారిని ఎప్పట్నుంచో కలుద్దామనుకున్నాను కుదర్లేదు. ఇన్నాళ్లకు ఆ కల తీరింది. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాలో నాకు ఛాన్స్ మిస్ అయింది. అందులో బాబీ సింహ చేసిన పాత్ర నేను చేయాల్సింది. కానీ అనివార్య కారణాలతో ఆ ఛాన్స్ మిస్ అయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. మీతో కలిసి నటించాలని ఉంది. ఇవాళ ఇలా ఈ ఈవెంట్లో చిరంజీవి సర్ ని కలవడం ఆనందంగా ఉంది అని అన్నారు.