RajaSaab : హ్యారీ పోటర్ సినిమా వైబ్స్ వచ్చాయి.. రాజాసాబ్ సినిమాపై బాలీవుడ్ స్టార్ నిర్మాత కామెంట్స్..
ప్రభాస్ మొదటిసారి హారర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Bollywood Producer Bhushan Kumar Interesting Comments on Prabhas The RajaSaab Movie
RajaSaab : ప్రభాస్ ఇటీవల సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ప్రస్తుతం భారీ లైనప్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రభాస్ మొదటిసారి హారర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రాజాసాబ్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి కాస్త భయపెట్టారు. రాజాసాబ్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ నిర్మాత భూషణ్ కుమార్ రాజాసాబ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Zebra Trailer : సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ వచ్చేసింది.. మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్..
టీ సిరీస్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. రాజాసాబ్ ఆడియో రైట్స్ మేము తీసుకున్నాము. ఈ క్రమంలో మేము సినిమాలోని కొన్ని సీన్స్, సాంగ్స్ విజువల్స్ చూసాము. అవి చూస్తుంటే హాలీవుడ్ సినిమా హ్యారీ పోటర్ వైబ్స్ కనిపించాయి. ఈ సినిమా ప్రేక్షకులని భయపెట్టి పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో రాజాసాబ్ సినిమాపై అంచనాలు మరిన్ని పెంచుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక రాజాసాబ్ ఆడియో రైట్స్ ని ఆల్మోస్ట్ 25 కోట్లకు కొన్నారని సమాచారం.