Zebra Trailer : సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ వచ్చేసింది.. మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జీబ్రా ట్రైలర్ విడుదల చేసారు.

Zebra Trailer : సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ వచ్చేసింది.. మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్..

Satya Dev Zebra Movie Trailer Released by Megastar Chiranjeevi

Updated On : November 12, 2024 / 8:38 PM IST

Zebra Trailer : సత్యదేవ్ త్వరలో ‘జీబ్రా’ సినిమాతో రాబోతున్నాడు. సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనుంజయ, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, సత్య, సునీల్, జెన్నిఫర్.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో జీబ్రా సినిమా తెరకెక్కుతుంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ బ్యానర్స్ పై SN రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Also Read : Ashok Galla – Namrata Shirodkar : నమ్రత అత్త వల్లే నేను హీరో అయ్యాను.. మహేష్ మేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు..

జీబ్రా సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా జీబ్రా ట్రైలర్ రిలీజ్ చేసారు. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జీబ్రా ట్రైలర్ విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే కామెడీ, థ్రిల్లింగ్, లవ్ స్టోరీ కథాంశంతో డబ్బు చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది. మీరు కూడా జీబ్రా ట్రైలర్ చూసేయండి..