Ashok Galla – Namrata Shirodkar : నమ్రత అత్త వల్లే నేను హీరో అయ్యాను.. మహేష్ మేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు..

అశోక్ గల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ ఫ్యామిలీ, నమ్రత ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Ashok Galla – Namrata Shirodkar : నమ్రత అత్త వల్లే నేను హీరో అయ్యాను.. మహేష్ మేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు..

Mahesh Babu Nephew Ashok Galla Interesting Comments on Namrata Shirodkar

Updated On : November 12, 2024 / 8:32 PM IST

Ashok Galla – Namrata Shirodkar : మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అశోక్ గల్లా రెండేళ్ల క్రితం హీరో అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

Also See : Game Changer Teaser Launch Event : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ టీజర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు చూశారా?

అశోక్ గల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ ఫ్యామిలీ, నమ్రత ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అశోక్ గల్లా మాట్లాడుతూ.. నమ్రత అత్త చాలా సపోర్ట్ గా ఉంటుంది. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని సలహాలు ఇస్తుంది. నేను హీరోగా వద్దామనుకునే ముందు బాగా జుట్టు పెంచి పోర్ట్ ఫోలియో(ఆడిషన్ ఫొటోలు) తీయించుకుందాం అనుకున్నాను. సింపుల్ గా చెన్నై వెళ్లి తీసుకుందాం అనుకున్నాను. కానీ నమ్రత అత్త ముంబై వెళ్లి నా హెయిర్ స్టైలింగ్ చేయించుకొని ప్రాపర్ అఫీషియల్ పోర్ట్ ఫోలియో చేపించమని చెప్పింది. అందుకు సపోర్ట్ కూడా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె వల్లే నేను హీరో అయ్యాను. నమ్రత అత్త సజెషన్స్ తీసుకుంటాను అని తెలిపాడు. దీంతో అశోక్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.