Chiranjeevi : నాగబాబుని ఓ సందర్భంలో గట్టిగా కొట్టేసిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..!

నాగబాబుని చిరంజీవి ఒక్కసారిగా గట్టిగా కొట్టారంట. చిరు ఎందుకు కొట్టారంటే..

Chiranjeevi shares interesting incident about he hit a nagababu

Chiranjeevi : మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ బంధం గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముగ్గురిలో ఏ ఒక్కర్ని విమర్శించినా మిగిలిన ఇద్దరు తట్టుకోలేరు. ఈ ముగ్గురి మధ్య ఎన్ని అభిప్రాయం బేధాలు ఉన్నప్పటికీ.. అన్నదమ్ముల అనుబంధం విషయంలో మాత్రం ఒకటిగా ఉంటారు. తమ విబేధాలను గొడవలుగా మార్చుకోకుండా కలిసి ఉంటూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంటారు.

అయితే చిరంజీవికి ఒకసారి నాగబాబు పై బాగా కోపం వచ్చి గట్టిగా కొట్టేశారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తెలియజేసారు. ఈ విషయం జరిగింది చిరంజీవి సినిమాల్లోకి రాకముందు. చిరంజీవి ఇంటర్ చదువుతున్న సమయంలో నాగబాబు ఆరో, ఏడో తరగతి చదువుతున్నారట. ఆ సమయంలో ఇంటిలోని చిన్న చిన్న పనులు అన్ని చిరునే చేస్తూ వచ్చేవారట. ఈక్రమంలోనే ఒకరోజు ఒకే సమయంలో రెండు పనులు చేయాల్సి వచ్చింది.

Also read Ranveer Singh : మీ స్టార్‌డమ్ ఏంటి.. మీరు చేసే యాడ్స్ ఏంటి.. జానీ సిన్స్‌తో రణ్‌వీర్ కొత్త యాడ్ చూశారా..

దీంతో చిరంజీవి వాటిలో ఒక పనిని నాగబాబుకి అప్పజెప్పారు. ‘లాండ్రీ దగ్గరికి వెళ్లి బట్టలు తీసుకు రా’ అని నాగబాబుకి చెప్పి.. చిరంజీవి బయటకి వెళ్లి మరో పనిని పూర్తి చేసుకొని వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత నాగబాబుని ‘బట్టలు తెచ్చావా?’ అని అడిగితే.. ‘తీసుకురాలేదు’ అని చెప్పారట. ‘ఎందుకు తీసుకు రాలేదు’ అని చిరు ప్రశ్నించగా.. ‘నిద్ర పోతున్నా’ అని నాగబాబు బదులిచ్చారట.

ఇంక అంతే, ఆ మాటలకు చిరంజీవికి విపరీతమైన కోపం వచ్చేసింది. దీంతో నాగబాబుని పట్టుకొని గట్టిగా కొట్టేసారు. నాగబాబుని అలా కొట్టడం చూసిన వారి తల్లి.. చిరుని బాగా తిట్టేశారట. అమ్మ కూడా తననే తిట్టడంతో చిరుకి మరింత కోపం కలిగింది. దీంతో సాయంత్రం తన తండ్రి వచ్చిన తరువాత.. చిరు ఏడుస్తూ జరిగినంతా చెప్పారట. అది విన్న చిరు తండ్రి.. నాగబాబుని మందలించారట. ఆ తరువాతే చిరు కోపం తగ్గిందట.