ఆ టీజర్‌ రిలీజ్ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవికి కొత్త టెన్షన్

టీజర్‌ చూసిన చాలా మంది డిస్సప్పాయింట్‌ అయ్యారని ఫీడ్ బ్యాక్ వచ్చిందట.

మెగాస్టార్‌ చిరంజీవికి కొత్త టెన్షన్ పట్టుకుందట. ఇటీవల రిలీజ్ అయిన..ఆయన లేటెస్ట్‌ మూవీ విశ్వంభర టీజర్‌కు మిక్స్‌డ్‌ రెస్పాన్స్ రావడంతో చిరుతో పాటు మూవీ యూనిట్‌ డైలమాలో పడిందట. అదేంటి ఇంత కష్టపడి.. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చేసిన ఎఫెక్ట్స్‌కు రెస్పాన్స్ రాలేదంటని టెన్షన్ పడుతున్నట్లు టాక్. అందుకే సంక్రాంతి బరి నుంచి తప్పుకుందట విశ్వంభర.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా టీజర్ దసరా పండగ రోజు గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. కొద్దిరోజుల్లోనే చాలా ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్‌ చేశారు. పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గేమ్‌ఛేంజర్‌ కంటే ముందే విడుదల చేయాలనుకున్నారు. కానీ సడెన్‌గా మే నెలకు పోస్ట్ పోన్ చేశారు. గేమ్‌ఛేంజర్‌ కోసం రిలీజ్‌ వాయిదా వేశామని అంటున్నా అసలు కారణం వేరే ఉందంటున్నారు. విశ్వంభర సినిమాకు గ్రాఫిక్, VFX చాలా కీలకమని..టీజర్‌లో ఉన్న విజువల్ వర్క్‌ ఎక్స్ ఫెక్ట్ చేసినట్టు రాలేదని భావిస్తున్నారట. అందుకే రీశూట్‌ చేయాలని ఫిక్స్‌ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

టీజర్‌ చూసిన చాలా మంది డిస్సప్పాయింట్‌ అయ్యారని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన మెగాస్టార్.. ఇమాజినేషన్‌కు తగ్గట్లుగా మూవీ ఔట్‌పుట్‌ వచ్చేలా చేయాలనుకుంటున్నారట. మరోసారి గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నాడంటున్నారు. అంతే కాదు కొంతమంది సీనియర్ డైరెక్టర్స్, vfx ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడి ఓపీనియన్స్‌ తీసుకున్నారని అంటున్నారు. కెమెరామెన్ ఛోటాకే నాయుడుతో మళ్ళీ ఎక్కడెక్కడ రీ షూట్ చేయ్యాలో ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారట. అందుకే విశ్వంభరను మే నెలకు పోస్ట్ పోన్‌ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Magic : విజయ్ దేవరకొండ సినిమా కంటే ముందు చిన్న సినిమా తీసుకొస్తున్న డైరెక్టర్..