Allu Arjun : పార్టీ చేసుకో అంటూ.. అల్లుడిపై చిరంజీవి స్పెషల్ ట్వీట్

తాజాగా అల్లు అర్జున్ కి తన మామ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెష్ చెప్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ట్విట్టర్లో చిరంజీవి.. ''హ్యాపీ బర్త్‌డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే........

Allu Arjun : పార్టీ చేసుకో అంటూ.. అల్లుడిపై చిరంజీవి స్పెషల్ ట్వీట్

Chiru

Updated On : April 8, 2022 / 11:40 AM IST

Chiranjeevi :  ‘గంగోత్రి’తో కెరీర్ ని మొదలు పెట్టి ‘పుష్ప’ వరకు ప్రయాణాన్ని సాగించి వీడు హీరో ఏంట్రా అన్న వాళ్ళతోనే పాన్ ఇండియా హీరో, స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అనిపించుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ కి భారతదేశం మొత్తం క్రేజ్ ఉంది. ‘పుష్ప’తో తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక నటన, డ్యాన్స్ పరంగా అంతకుముందే నిరూపించేసుకున్నాడు. ఇవాళ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Ghani : గని ప్రీ రిలీజ్ బిజినెస్..

తాజాగా అల్లు అర్జున్ కి తన మామ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెష్ చెప్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ట్విట్టర్లో చిరంజీవి.. ”హ్యాపీ బర్త్‌డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వచ్చేలా చేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో’’ అని పోస్ట్ చేశారు. చిరంజీవి అల్లు అర్జున్ కి విషెస్ తెలపడంతో చిరు ట్వీట్‌పై బన్నీ అభిమానులు లైక్స్‌, రీట్వీట్స్‌ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే 20 వేలకు పైగా లైక్స్, 4 వేలకి పైగా రీట్వీట్స్ అందుకుంది చిరంజీవి అల్లు అర్జున్ పై చేసిన ట్వీట్.