Chiranjeevi : క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అని నమ్మకం ఇచ్చారు.. యుంగ్ డైరెక్టర్స్ ఆయన్ని చూసి నేర్చుకోవాలి..

ఇటీవల కొన్ని రోజుల క్రితం కళాతపస్వి, దర్శకులు విశ్వనాధ్ గారు మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకి ఎన్నో గొప్ప క్లాసిక్ సినిమాలని అందించిన విశ్వనాధ్ గారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. తాజాగా పలువురు సినీ ప్రముఖులు కళాతపస్వి విశ్వనాధ్ కళాంజలి అనే పేరిట ఆయన సంతాప సభ నిర్వహించారు..............

Chiranjeevi :  ఇటీవల కొన్ని రోజుల క్రితం కళాతపస్వి, దర్శకులు విశ్వనాధ్ గారు మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకి ఎన్నో గొప్ప క్లాసిక్ సినిమాలని అందించిన విశ్వనాధ్ గారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. తాజాగా పలువురు సినీ ప్రముఖులు కళాతపస్వి విశ్వనాధ్ కళాంజలి అనే పేరిట ఆయన సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మంజు భార్గవి, రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, మురళి మోహన్, అలీ, రాఘవేంద్రరావు, నిర్మాత విశ్వప్రసాద్, మీనా , SV కృష్ణ రెడ్డి, రాధికా, అశ్వినీదత్, ఆమని, రాజశేఖర్, సుమలత, R నారాయణమూర్తి, శేఖర్ కమ్ముల, తనికెళ్ళ భరణి, జయసుధ, సుబ్బిరామిరెడ్డి, వైవిఎస్ చౌదరి, దర్శకుడు VN ఆదిత్య, విశ్వనాధ్ కుటుంబసభ్యులు.. మరికొంతమంది ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్వహించింది.

 

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఇది విశ్వనాధ్ గారి సంతాప సభ అన్నారు. కానీ ఆయన మనకు ఇచ్చిన సినిమాలు, జ్ఞానం, ఆయన గొప్పతనం.. ఇవన్నీ చూసి మనం ఒక సంబరంలా జరుపుకోవాలి అంత గొప్ప మనిషితో మనం కలిసి పనిచేసినందుకు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వారందరికీ నా ధన్యవాదాలు. నేను విశ్వనాధ్ గారిని మూడు కోణాల్లో చూస్తాను. నాకు మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చి నాకు అవార్డులు వచ్చేలా చేసిన దర్శకుడిగా, ప్రతిక్షణం నా నటనను సరిదిద్ది, నా నటనను మార్చేసిన గురువుగా, షూటింగ్ సమయంలో నటుడిగా కాకుండా ఓ బిడ్డలా నాకు అన్నం పెట్టి, ఆయన చూపించిన ప్రేమ విషయంలో ఓ తండ్రిగా చూస్తాను.

 

నేను నటుడిగా మాస్ సినిమాలు చేస్తున్న సమయంలో నాకు ‘శుభలేఖ’ సినిమా ఇచ్చి నా స్పీడ్ నటనని ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటూ నిదానం చేసి నా నటనలో నెమ్మదిని తీసుకొచ్చారు. నేను ఒకసారి సెట్ లో సరదాగా బెత్తం పట్టుకొని తురుగుతుంటే అదే డ్యాన్స్ అంటూ నాతో సొంతంగా డ్యాన్స్ చేయించేలా చేశారు. నాకు క్లాసికల్ డ్యాన్స్ గురించి అస్సలు తెలియకపోయినా నాతో భారతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి చేయించారు, క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అని నమ్మకం ఇచ్చారు ఆయన. నేను ఫుల్ యాక్షన్ హీరోగా ఉన్నప్పుడు మళ్ళీ నాకు స్వయంకృషి సినిమా ఇచ్చారు. మరో అద్భుతమైన సినిమా ఆపద్బాంధవుడు ఇచ్చారు.

Pathaan Offer : 1000 కోట్ల కోసం పఠాన్ మరో ఆఫర్.. మొన్న ఒక్క రోజే.. ఇప్పుడు వీక్ డేస్ అంతా..

ఇప్పుడు హీరోలని కెమెరా ముందు ఎటు మూమెంట్ కావాలంటే అటు నడవమని చెప్పి కెమెరాని ఒకేచోట పెడుతున్నారు డైరెక్టర్స్. కానీ విశ్వనాధ్ గారు హీరోలని ఎలా కావాలంటే అలా చేయమని చెప్పి కెమెరాని ఆయనకి నచ్చినట్టు ఆర్టిస్టుల చుట్టూ తిప్పుకుంటారు. ఇది చెప్పి ఇప్పటి డైరెక్టర్స్ ని నేర్చుకోమంటాను. ఆయన దగ్గర్నుంచి ఇప్పటి డైరెక్టర్స్ చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆయన ఎమోషన్ సీన్స్ తో క్యారెక్టర్స్ ఏడవడం మాత్రమే కాదు ప్రేక్షకులు ఏడుస్తారు. కానీ ఇప్పటి డైరెక్టర్స్ ఆర్టిస్టులు ఏడిస్తే ప్రేక్షకులు ఏడుస్తారు అంటారు. విశ్వనాధ్ గారి చాలా సినిమాలలో క్యారెక్టర్స్ ఏడవకుండానే అక్కడ ఉన్న సీన్స్ తోనే ప్రేక్షకులు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన లాంటి గొప్ప దర్శకుడితో పనిచేయడం మన అదృష్టం అని అన్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు