Pathaan Offer : 1000 కోట్ల కోసం పఠాన్ మరో ఆఫర్.. మొన్న ఒక్క రోజే.. ఇప్పుడు వీక్ డేస్ అంతా..

పఠాన్ సినిమా ఫిబ్రవరి 19 ఆదివారం వరకు 988 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సౌత్ సినిమాలు బాహుబలి, KGF కలెక్షన్స్ ని దాటించకపోయినా కనీసం 1000 కోట్లు అయినా కొల్లగొట్టాలని చాలా ఎదురు చూస్తుంది. దీంతో ఇటీవల సరికొత్త అఫర్ ప్రకటించింది చిత్ర యూనిట్...................

Pathaan Offer : 1000 కోట్ల కోసం పఠాన్ మరో ఆఫర్.. మొన్న ఒక్క రోజే.. ఇప్పుడు వీక్ డేస్ అంతా..

Pathaan movie unit announce special Offer ticket price only 110 rupees all over india multiplexes

Updated On : February 20, 2023 / 7:37 AM IST

Pathaan Offer :  షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా మంచి విజయం సాధించి, చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కెల్క్షన్స్ సాధించింది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ హిట్ కొట్టడమే కాకుండా గత సంవత్సర కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ కి పెద్ద విజయాన్ని అందించాడు.

పఠాన్ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది. ప్రీ బుకింగ్స్ తోనే మంచి కలెక్షన్స్ వసూలు చేసిన పఠాన్ అయిదు రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో ఎలాగైనా పఠాన్ సినిమా సౌత్ సినిమాలైన బాహుబలి, KGF కలెక్షన్స్ దాటాలని అనుకుంది కానీ మొదటి వారం కలెక్షన్స్ బాగానే వచ్చినా ఆ తర్వాత నుంచి స్లో అయింది. పఠాన్ సినిమా కలెక్షన్స్ పెంచడానికి, సౌత్ సినిమా వేలకోట్ల కలెక్షన్స్ బద్దలుకొట్టడానికి బాలీవుడ్ అంతా ఒక్కటై తమ సినిమాలని వాయిదా వేస్తూ, పఠాన్ ని మరింత ప్రమోట్ చేశారు. ఎలాగోలా కష్టపడి 900 కోట్లకు తీసుకొచ్చారు పఠాన్ సినిమా గ్రాస్ కలెక్షన్స్. ఇక అక్కడ్నుంచి మాత్రం నత్త నడకన కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే సినిమా రిలీజయి మూడు వారాలు పైగా అవ్వడం, వేరే సినీ పరిశ్రమలలో సినిమాలు రిలీజ్ అవ్వడంతో పఠాన్ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి.

పఠాన్ సినిమా ఫిబ్రవరి 19 ఆదివారం వరకు 988 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సౌత్ సినిమాలు బాహుబలి, KGF కలెక్షన్స్ ని దాటించకపోయినా కనీసం 1000 కోట్లు అయినా కొల్లగొట్టాలని చాలా ఎదురు చూస్తుంది. దీంతో ఇటీవల సరికొత్త అఫర్ ప్రకటించింది చిత్ర యూనిట్. గత శుక్రవారం ఇండియా మొత్తం అన్ని మల్టిప్లెక్స్ లలో సినిమా టికెట్ రేట్లు తగ్గించి కేవలం 250 రూపాయల టికెట్ ని కేవలం 110 రూపాయలకు ప్రకటించింది. అయినా 1000 కోట్లు అందకపోవడంతో ఆ తర్వాత ఆదివారం నాడు ఒక్క రోజు కేవలం 200 రూపాయలే అని టికెట్ రేటు ప్రకటించింది. అయినా 1000 కోట్లు రాకపోవడంతో ఇప్పుడు ఆఫర్ ని మరోసారి ప్రకటించింది.

Michael : రిలీజయిన 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్ మైఖేల్..

మొన్న కేవలం ఒక్కరోజే అయితే ఈ సారి ఏకంగా ఈ వారంలో వీక్ డేస్ సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజులు 110 రూపాయల టికెట్ ఆఫర్ ని ప్రకటించింది. ఇలా అయినా జనాలు వచ్చి 1000 కోట్ల కలెక్షన్స్ త్వరగా దాటుతాయని ఆశిస్తుంది. పఠాన్ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ కాస్త లేట్ అయినా కచ్చితంగా దాటుతుంది. కానీ ఆ 1000 కోట్ల కలెక్షన్స్ రప్పించడానికి చిత్ర యూనిట్, బాలీవుడ్ చేసే విన్యాసాలు చూస్తుంటేనే పాపం అనిపిస్తుంది. ఇన్ని రోజులు డీలా పడిపోయిన బాలీవుడ్ పఠాన్ హిట్ తో ఓ రేంజ్ లో ప్రమోషన్స్, హడావిడి చేసింది. ఇక పఠాన్ నేడో, రేపో 1000 కోట్లు దాటితే ఇక బాలీవుడ్ ఏ రేంజ్ లో హడావిడి చేస్తుందో చూడాలి.