Site icon 10TV Telugu

Chiranjeevi : అత్తమ్మ చేసిన మంచి పని గురించి చెప్పిన చిరంజీవి.. మరణించిన తర్వాత.. అల్లు అర్జున్ నానమ్మ గ్రేట్..

Chiranjeevi Tells Interesting Thing about Allu Kanakaratnam

Chiranjeevi

Chiranjeevi : నేడు ఉదయం అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ మరణించారు. గ‌త కొన్నాళ్లుగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె నేడు ఉదయం మరణించారు. ఆమె చిరంజీవి భార్య సురేఖకు తల్లి కూడా కావడంతో అల్లు, మెగా ఫ్యామిలీలు తీవ్ర విషాదంలో ఉన్నారు. నేడు సాయంత్రమే అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు.(Chiranjeevi)

అత్తమ్మకావడంతో ఉదయం నుంచి చిరంజీవి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే దాకా అక్కడే ఉన్నారు. అత్తమ్మ పాడె కూడా మోశారు. అయితే తాజాగా సాయంత్రం ఓ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి తన అత్తమ్మ చేసిన ఓ మంచి విషయం తెలిపారు.

Also See : Allu Arjun Ram Charan : చరణ్ కి అమ్మమ్మ.. బన్నీకి నానమ్మ.. ఆమె మరణంతో.. చాన్నాళ్లకు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలు వైరల్..

చిరంజీవి మాట్లాడుతూ.. నేడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మా అత్తగారు లేరు అనే వార్త వచ్చింది. అల్లు అరవింద్ ఇక్కడ లేరు, బెంగుళూరులో ఉన్నారు. నేను వెంటనే వెళ్ళాను. ఆ సమయంలో మేము అనుకున్న ఆర్గాన్ డొనేషన్ గుర్తుకు వచ్చింది. ఆ అర్ధరాత్రి సమయంలో మా బ్లడ్ బ్యాంక్ స్వామి నాయుడుకి ఫోన్ చేసి LV ప్రసాద్ ఐ హాస్పిటల్ లో టెక్నిషియన్స్ ని కనుక్కో ఈ లోపు నేను ఆవిడ ఐ డొనేషన్ కి అంతా రెడీ చేస్తాను అని చెప్పాను. వాళ్ళు రెడీగా ఉంటారు వస్తారు అన్నాడు. ఈ లోపు అరవింద్ బయలుదేరాడు.

అరవింద్ కి ఫోన్ చేసి ఇలా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నాకు అత్తమ్మ గారికి, మా అమ్మ గారికి మధ్య ఒక సారి మాట్లాడుకున్నాం దీని గురించి. మీరు ఇస్తారా అని అడిగాను. కాలి బూడిద అయ్యే శరీరానికి చచ్చిపోయాక ఏం చేస్తాం అలాగే నీ ఇష్టం ఇచ్చేద్దాం అన్నారు. ఆవిడ ఎక్కడా దీని కోసం సంతకం పెట్టలేదు కానీ నాకు ఆ మాటే ప్రతిజ్ఞ లాగా అనిపించింది. ఏం చేయమంటావ్ అరవింద్ అని అడిగితే ఓకే చేసేయి అన్నాడు. ఇవాళ ఉదయం ఆమె కళ్ళను తీసి హాస్పిటల్ కి పంపించాను అని తెలిపారు. దానైకి సంబంధించిన ఫోటోలను తన ఫోన్ లో నుంచి మీడియాకు చూపించారు.

Also See : Allu Aravind : అల్లు అరవింద్ తల్లి మరణం.. సెలబ్రిటీల నివాళులు.. బన్నీ ఇంటి నుంచి ఫొటోలు..

దీంతో అల్లు అర్జున్ నానమ్మ గ్రేట్ అని, మరణించిన తర్వాత ఇంకొకరికి చూపు అవుతుందని ఆమెని అభినందిస్తూనే ఇలాంటి పనికి ముందుకొచ్చిన మెగాస్టార్ ని కూడా అభినందిస్తున్నారు.

Exit mobile version