చిరంజీవి.. ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్

సైరా నరసింహారెడ్డి ఐదు భాషల్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోలెడు సందడి చేసింది. తమిళ, మళయాలం, హిందీ వెర్షన్లలో సై.. సైరా అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టించిన సైరా.. సాహో, బాహుబలి సినిమాల నెంబర్లను తుడిచిపెట్టేసింది. అంతే రేంజ్ లో చిరు 152వ సినిమా ఉండాలని దసరా పండుగను డబల్ చేసేందుకు కొరటాల శివ రెడీ అయ్యాడు.
మరో భారీ ప్రాజెక్టుతో ప్రజల ముందుకు రానున్న చిరంజీవి సినిమాకు కోకాపేట్‌లో భారీ సెట్ సిద్ధమైంది. సంక్రాంతి లోపే అక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సినిమా యూనిట్ చెబుతుంది. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయ్‌గా కనిపించనున్నట్లు సమాచారం. మరోసారి స్టాలిన్ జోడీ చిరూ-త్రిషలు ఏ పాటి రొమాన్స్ చేస్తారో సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్ కంపెనీ, మాటినీ ఎంటర్‌టైన్మెంట్స్‌లు కలిసి నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా తిరు, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్‌లు ఫిక్స్ అయిపోగా మ్యూజిక్ డైరక్టర్‌ను ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది.