Chitti Muthyalu : “చిట్టిముత్యాలు” (రొమాన్స్ విత్ రైస్).. సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన సినీ ప్రముఖులు..

కొత్త కొత్త పేర్లతో సరికొత్తగా అనేక రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి. తాజాగా సరికొత్త రెస్టారెంట్ "చిట్టిముత్యాలు" (రొమాన్స్ విత్ రైస్) ప్రారంభమైంది.

Chitti Muthyalu Restaurant Opened By Dil Raju Anil Ravipudi Hareesh Shankar

Chitti Muthyalu : ఇటీవల హైదరాబాద్(Hyderabad) లో సరికొత్త రెస్టారెంట్ లు చాలానే ఓపెన్ అవుతున్నాయి. కొత్త కొత్త పేర్లతో సరికొత్తగా అనేక రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి. తాజాగా సరికొత్త రెస్టారెంట్ “చిట్టిముత్యాలు” (రొమాన్స్ విత్ రైస్) ప్రారంభమైంది. ప్రముఖ రెస్టారెంట్స్ వ్యాపారవేత్త కూచిపూడి వెంకట్ ఇప్పటికే.. ఉలవచారు, రాజుగారి తోట, కూచిపూడి పలావ్, రాజుగారి కోడి పలావ్, మారేడుమిల్లి వంటి రెస్టారెంట్స్ తో సక్సెస్ గా దూసుకెళ్తూ తాజాగా “చిట్టిముత్యాలు” పేరుతో మరో రెస్టారెంట్ కు శ్రీకారం చుట్టారు.

స్వతహాగా వెంకట్ దర్శకుడు కావడంతో దీనికి “చిట్టిముత్యాలు” రెస్టారెంట్ కి రొమాన్స్ విత్ రైస్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. హైదరాబాద్, హైటెక్ సిటీ సమీపంలో… మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని ఇమేజ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన చిట్టిముత్యాలు రెస్టారెంట్ ను ప్రఖ్యాత నిర్మాతలు దిల్ రాజు, టిజి విశ్వప్రసాద్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ప్రారంభించారు. దిల్ రాజు.. రెస్టారెంట్ రిబ్బన్ కట్ చేయగా, హరీష్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనిల్ రావిపూడి “మెను” లాంచ్ చేయగా, విశ్వప్రసాద్ క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశారు.

Also Read : Entertainment News : నేటి ఎంటర్టైన్మెంట్ విశేషాలు ఇవే.. బాలయ్యతో యానిమల్.. సలార్ బుకింగ్స్.. సైంధవ్‌ పాట..

దిల్ రాజు, అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇంతటి అత్యద్భత ఆహ్లాదకర వాతావరణం సృష్టించి, ఎంత తిన్నా తనివి తీరని నోరూరించే వంటకాలతో భోజనప్రియుల మనసులు దోచుకోవడం కూచిపూడి వెంకట్ కు మాత్రమే సాధ్యమని అన్నారు. టి.జి.విశ్వప్రసాద్, హరీష్ శంకర్ మాట్లాడుతూ.. చిట్టిముత్యాలు హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో బాగా సక్సెస్ అవుతుంది అని తెలిపారు. కూచిపూడి వెంకట్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో రెస్టారెంట్స్ ఏర్పాటు చేయడం నాకు ప్యాషన్. “చిట్టిముత్యాలు”తో ఒక గొప్ప భోజనానుభూతిని పంచేందుకు చాలా నెలలు శ్రమించామని తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి తమ చేతుల మీదుగా చిట్టిముత్యాలు రెస్టారెంట్ ప్రారంభించిన దిల్ రాజు, టీజీ విశ్వప్రసాద్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడిలకు కృతజ్ఞతలు తెలిపారు.