Entertainment News : నేటి ఎంటర్టైన్మెంట్ విశేషాలు ఇవే.. బాలయ్యతో యానిమల్.. సలార్ బుకింగ్స్.. సైంధవ్ పాట..
టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా అప్డేట్స్ వైపు ఒక లుక్ వేసేయండి.

Latest Today Top 20 Entertainment News Tollywood to Bollywood
Entertainment News : నేటి ఎంటర్టైన్మెంట్ విశేషాలు ఇవే..
ఈ నెల 21న “సైంధవ్” ఫస్ట్ సింగిల్
వెంకటేశ్, శైలేష్ కొలను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సైంధవ్. ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది యూనిట్.
“సలార్” యూఎస్ బుకింగ్స్
సలార్ యూఎస్ బుకింగ్స్‌పై క్లారిటీ వచ్చింది. నార్త్ అమెరికాలో నవంబర్ 20 నుంచి సలార్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్టుగా క్రేజీ యాక్షన్ పోస్టర్‌తో కన్ఫర్మ్ చేశారు. దీంతో నవంబర్ 20 నుంచి యూఎస్‌లో సలార్ మూవీ హోరెత్తనుంది. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.
డైరెక్టర్ వశిష్ట ఇంట్రెస్టింగ్స్ కామెంట్స్
చిరంజీవి 156 మూవీపై డైరెక్టర్ వశిష్ట ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. తన చిన్నతనంలో మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ చూసి ఎంతో ఆశ్చర్యపోయానని డైరెక్టర్ వశిష్ట అన్నారు. చిరంజీవి 156 మూవీ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీలో దాదాపు 70 శాతానికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, తప్పకుండా చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అన్నారు.
బర్త్ డే పార్టీలో మహేశ్ బాబు
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సందడి చేశారు. ఈ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలను ఆయన సతీమణి నమ్రత మహేశ్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పిక్స్‌లో ఫ్రెండ్స్ అందరితో కలిసి మహేశ్ బాబు ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఆహాలో “యానిమల్” అన్‌స్టాపబుల్ షో
బాలయ్యతో యానిమల్ ఇంటర్వ్యూ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి డైరెక్షన్లో రణబీర్, రష్మిక జంటగా డిసెంబర్ ఫస్ట్‌న రిలీజవుతున్న యానిమల్.. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్‌లో సందడి చేసింది. లేటెస్ట్‌గా చిన్న వీడియో రిలీజ్ చేసిన టీమ్ .. ఫుల్ ఇంటర్వ్యూ ఆహాలో ఈనెల 24న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
పొలిటీషియన్ గెటప్‌లో అనిల్ రావిపూడి..
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పొలిటీషియన్ గెటప్‌లో దర్శనమిచ్చారు. అనుకోని విధంగా అనిల్ రావిపూడి తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఆయన పొలిటీషియన్‌గా యాక్టింగ్ చేయబోతున్నారా? లేక “ఆహా”లో చేయబోతున్న పొలిటికల్ మూవీకి సంబంధించిన స్నీక్ పీక్‌నా అనేలా ఆ వీడియో ఆకట్టుకుంటోంది.
రూ.200 కోట్ల క్లబ్ వైపు “టైగర్ 3”
“టైగర్ 3” మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కేరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబడుతూ ఈ మూవీ దూసుకుపోతోంది. నిప్పటివరకు ఈ మూవీ 183 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. త్వరలో ఈ మూవీ 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమనిస్తుంది.
మరో 100 థియేటర్లలో “లియో” రిలీజ్
బాక్సీఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచి “లియో” మూవీ మరో వందల థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను నమోదు చేసిన తమిళ చిత్రంగా లియో నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ మూవీని డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించారు.
రూమర్స్ పట్టించుకోను – అలియా భట్
తనపై వస్తున్న రూమర్స్‌ను ఖండించారు అందాల భామ అలియా భట్. తాను సన్నగా మారేందుకు, చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు కొన్ని సర్జరీలు చేయించుకున్నానని తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. తనపై రకరకాల రూమర్స్ వచ్చినా… వాటిని తాను పట్టించుకోనని… అవి తనను బాధించవని అలియా భట్ చెప్పారు.
“హస్తినాపురం” షూటింగ్ ప్రారంభం
“హస్తినాపురం” మూవీ ఇవాళ గ్రాండ్‌గా ప్రారంభమైంది. యంగ్ హీరో కార్తీక్ రాజు, హీరోయిన్ నిషా నటిస్తున్న ఈ మూవీని రాజా గండ్రోతు తెరకెక్కిస్తున్నారు. తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య స్క్రిప్ట్ అందజేశారు. హస్తినాపురం మూవీ కొత్త పాయింట్‌తో రాబోతోందని… ఇది రెగ్యులర్ చిత్రంలా ఉండదని, డైరెక్టర్ రాజా ఈ చిత్రానికి అద్భుతంగా కథ రాసుకున్నారని హీరో కార్తీక్ రాజు చెప్పారు.
గ్రాండ్‌గా “పర్‌ఫ్యూమ్” ప్రీ రిలీజ్ ఈవెంట్
పర్‌ఫ్యూమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ హాజరయ్యారు. ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ పతాకంపై రాబోతున్న ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. ఈ మూవీ ఈనెల 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
“లింగి లింగి లింగిడి”కి 35 మిలియన్ వ్యూస్
ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతోన్న కోటబొమ్మాళి మూవీలోని “లింగి లింగి లింగిడి”సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ మారింది. ఇప్పటికే ఈ సాంగ్‌కు 35 మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక కొటబొమ్మాళి పీఎస్ మూవీ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
శరవేగంగా “పోలీస్ వారి హెచ్చరిక” షూటింగ్
దర్శకులు బాబ్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా రోజు ప్రారంభమైన ఈ షూటింగ్ ఇప్పటికే 50శాతం పూర్తయింది. హైదరాబాద్, ఘట్‌కేసర్, ఘణపూర్, షామీర్‌పేటతో పాటు పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని డైరెక్టర్ బాబ్జీ తెలిపారు.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఫైటర్
హృతిక్ రోషన్, దీపికా పదుకోణే జంటగా నటిస్తున్న చిత్రం ఫైటర్. ఈ సినిమాకు సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లు స్టార్ట్ చెయ్యబోతోంది చిత్రయూనిట్. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఫైటర్ మూవీ ఉండనుంది.
ట్రెండింగ్‌లో “ధ్రువ నక్షత్రం” సాంగ్
ధ్రువ నక్షత్రం మూవీలోని “ఒక మది” సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. నిన్న రిలీజైన ఈ సాంగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తమిళ్ స్టార్ హీరో విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రీతు వర్మ హరీష్ జయరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ ఈనెల 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
జూనియర్ ఎన్టీఆర్‌తో అల్లు శిరీష్
అల్లు శిరీష్, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఎన్టీఆర్‌ని హగ్ చేసుకున్న శిరీష్.. ఓ క్యాప్షన్ జోడించారు. ఎన్టీఆర్‌ది గొప్ప హృదయం అంటూ శిరీష్ పోస్ట్ చేశారు. వీరిద్దరి బ్యూటిఫుల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్‌తో పవర్ ఫుల్ సీన్ చేయాలి- డైరెక్టర్ అనిల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పవర్ ఫుల్ సినిమా చేయాలని ఉందని పొలిమేర 2 డైరెక్టర్ అనిల్ అన్నారు. పవన్ కళ్యాణ్‌తో లీడర్ లాంటి సినిమా చేయాలని ఉందని, అయితే పవన్ పాలిటిక్స్‌లోకి వచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ లీడర్‌ల ముందు ఉండి నడిపిస్తుంటే, కొన్ని కోట్ల మంది వెనకాల నడుస్తుంటే ఆ సీన్ ఎంతో బాగుంటుందని అన్నారు.
కంగ్రాట్స్ చెప్పిన సాయిధరమ్
ఇవాళ రిలీజ్ అయిన మూడు సినిమాలపై హీరో సాయిధరమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం, సప్త సాగరాలు దాటి సైడ్ బి, స్పార్క్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలకు సాయిధరమ్ తేజ్ కంగ్రాట్స్ తెలిపారు. సప్త సాగరాలు దాటి సినిమాకి ఎగ్జైట్ అవుతున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఓటీటీలో ‘టైగర్ నాగేశ్వరరావు’
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దసరా కానుకగా..అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నెలరోజులు పూర్తి కాకుండానే.. ఇలా ఓటీటీలోకి వచ్చేసింది.
“చిట్టి ముత్యాలు” రెస్టారెంట్ ఓపెనింగ్
హైదరాబాద్ హైటెక్ సిటీకి సమీపంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, టీజీ విశ్వ ప్రసాద్, డైరెక్టర్లు హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి “చిట్టి ముత్యాలు” రెస్టారెంట్‌ను ప్రారంభించారు. దిల్ రాజు రెస్టారెంట్ రిబ్బన్ కట్ చేయగా, హరీష్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనిల్ రావిపూడి “మెను” లాంచ్ చేయగా, విశ్వప్రసాద్ క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశారు.