Veera Dheera Soora : విక్రమ్ ‘వీర ధీర శూర పార్ట్ 2’ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ అదిరిందిగా..

తాజాగా ‘వీర ధీర శూర పార్ట్ 2’ ట్రైలర్ రిలీజ్ చేసారు.

Chiyaan Vikram SJ Suryah Veera Dheera Soora Telugu Trailer Released

Veera Dheera Soora : తమిళ్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వీర ధీర శూర పార్ట్ 2. ఈ సినిమా మార్చి 27న తమిళ్, హిందీ, తెలుగులో రిలీజ్ కాబోతుంది. H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మాణంలో ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Toxic : యశ్ ‘టాక్సిక్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. ఆ పండక్కి..

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ‘వీర ధీర శూర పార్ట్ 2’ ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ చూస్తుంటే పోలీసులంతా కలిసి ఒకర్ని చంపడానికి రాత్రి పూట జాతరలో వస్తారు. కథ అంతా ఒక్క రాత్రిలో జరుగుతున్నట్టు ఉంది. మరి ఎవర్ని చంపాలనుకుంటారు? హీరోనా? లేదా హీరో ఎవర్నైనా కాపాడతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఈ సినిమాకి మొదట పార్ట్ 2 చేస్తున్నారు. ఇది హిట్ అయితే దీనికి ప్రీక్వెల్ పార్ట్ 1 చేస్తారట.