Chris Evans married Alba Baptista in presence of Robert Downey Jr Jeremy Renner
Chris Evans : వరల్డ్ వైడ్ గా మార్వెల్ హీరోలు ఎంతటి పాపులారిటీని సంపాదించుకున్నారో అందరికి తెలిసిందే. ఇక అవెంజర్స్ కి లీడర్ అయిన కెప్టెన్ అమెరికా అలియాస్ ‘క్రిస్ ఎవాన్స్’ సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నాడట. ఈ వివాహానికి ఐరన్ మ్యాన్ అలియాస్ ‘రాబర్ట్ డౌనీ జూనియర్’ (Robert Downey Jr), మరో అవెంజర్ ‘జెరెమీ రెన్నర్’ (Jeremy Renner) కూడా హాజరయ్యారట. పోర్చుగీస్ నటి ‘ఆల్బా బాప్టిస్టా’ (Alba Baptista) అనే అమ్మాయితో క్రిస్ ఎవాన్స్ ఎప్పటినుంచో ప్రేమాయణం నడుపుతున్నాడు.
కొన్నాళ్ళు నుంచి డేటింగ్ లో ఉంటున్న ఈ జంట.. తాజాగా ఏ హడావుడి లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో వీరి వివాహం జరిగినట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇద్దరి ఫ్యామిలీ మెంబెర్స్, చాలా దగ్గర స్నేహితులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యారట.ఇక ఈ వివాహానికి అవెంజర్స్ టీం నుంచి రాబర్ట్, జెరెమీ హాజరుకాగా వారికీ సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Jeremy Renner with Chris Hemsworth, Robert Downey JR., Susan Downey at the Newbury Boston for a wedding of Chris Evans and Alba Baptista. pic.twitter.com/6fqfoHGfdY
— Jeremy Renner Net (@JRennerNet) September 10, 2023
కాగా క్రిస్ ఎవాన్స్ 41 ఏళ్ళ వయసు అయితే.. ఆల్బా బాప్టిస్టా వయసు 26 సంవత్సరాలు మాత్రమే. ఈమె ఒక పోర్చుగీస్ యాక్టర్. The Warrior Nun షోతో మంచి ఫేమ్ నే సంపాదించుకుంది. ఇక క్రిస్ హాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంటుంది. వీరిద్దరూ కలిసి ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి.