Devara : ఎన్టీఆర్ దేవర షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రత్నవేలు.. నడి సముద్రంలో..
ఎన్టీఆర్ దేవర షూటింగ్ అప్డేట్ ఇచ్చిన డిఓపి రత్నవేలు. నడి సముద్రంలో ఎన్టీఆర్‌తో..

cinematographer Rathnavelu gave update on NTR Devara movie shooting
Devara : ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ బజ్ కి తగ్గట్టు కొరటాల కూడా మూవీని అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలు చాలా ఉండబోతున్నాయి. సినిమాలో ఇవే హైలైట్ గా ఉండబోతున్నాయట. దీంతో వీటి చిత్రీకరణ కోసం హాలీవుడ్ మేకర్స్ ని రంగంలోకి దించారు.
Shahrukh Khan : సొంత రికార్డునే బద్దలు కొట్టిన షారుఖ్.. పఠాన్ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసిన జవాన్..
హాలీవుడ్ మూవీ ‘ట్రాన్స్‌ఫార్మర్స్’కు యాక్షన్ పార్ట్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ ‘కెన్నీ బెట్స్’, ఆక్వా మ్యాన్ సినిమాకి VFX డిజైనర్ గా వర్క్ చేసిన ‘బ్రాడ్ మిన్నిచ్’ని ఈ సినిమా కోసం పని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక వీరి ఆధ్వర్యంలో మూవీలోని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు కొరటాల, డిఓపి రత్నవేలు పక్కా ప్రణాళికతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ని రత్నవేలు షేర్ చేశాడు.
Samantha : ఆస్ట్రియా అయిపోయింది.. ఇప్పుడు ఇటలీ.. యూరప్ మొత్తాన్ని చక్కర్లు కొట్టేస్తున్న సమంత..
ఈ మూవీలో ఎన్టీఆర్ తో నడి సముద్రంలో ఒక భారీ నైట్ యాక్షన్ సీన్ ఉందట. తాజాగా దీనికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసినట్లు రత్నవేలు తెలియజేశాడు. అలాగే సెట్స్ లోని ఒక పిక్ ని కూడా షేర్ చేశాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాలో పలు యాక్షన్ సీక్వెన్స్ ని మేకర్స్ తెరకెక్కించారు. చూస్తుంటే మూవీ హాలీవుడ్ సినిమాల మాదిరి పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుందని తెలుస్తుంది.
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro ?director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara ?@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా కనిపించబోతున్నాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.