ఈ సారి చిరు వంతు : క్లాస్ ఆఫ్ 80’s రీ-యూనియన్

‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’... పదవ వార్షికోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌‌లోని తన నివాసంలో రీ-యూనియన్‌ పార్టీ ఏర్పాటు చేయనున్నారు..

  • Publish Date - October 25, 2019 / 12:10 PM IST

‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’… పదవ వార్షికోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌‌లోని తన నివాసంలో రీ-యూనియన్‌ పార్టీ ఏర్పాటు చేయనున్నారు..

‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’… 1980 లో నటించిన స్టార్స్‌ తమ గ్రూప్‌కి పెట్టుకున్న పేరు ఇది. ప్రతి ఏడాది ఒక చోట కలుస్తూ రీ-యూనియన్‌ జరుపుకుంటారు అప్పటి హీరో, హీరోయిన్లు. ఈ గ్రూప్‌లో మోహన్‌లాల్, రజినీ కాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, వీకే నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, రమేష్ అరవింద్, రమ్యకృష్ణ, ప్రభు, భాను చందర్, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, భాగ్యరాజ్, ఖుష్భూ, శరత్‌కుమార్, సత్యరాజ్, జయరామ్, నదియా, సుమన్‌ వంటి స్టార్స్‌ ఉన్నారు.

వీళ్లు కలిసిన ప్రతిసారి ఆ పార్టీకి ఓ డ్రెస్‌ కోడ్‌ ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట రీ- యూనియన్‌ ప్లాన్‌ చేస్తుంటారు. దాంతో పాటు టీమ్‌లో ఉన్న ఓ స్టార్‌ అందరికీ పార్టీ ఇస్తుంటారు. ఈ సంవత్సరం ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ పదో యానివర్శరీ. టెన్త్‌ యానివర్శరీ పార్టీ హైదరాబాద్‌లో చిరంజీవి స్వగృహంలో జరగనుందని తెలిసింది.

ఇటీవలే చిరంజీవి తన నివాసాన్ని కొత్త హంగులతో రీ మోడలింగ్‌ చేయించారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో కొత్తగా తయారైన ఇంట్లో వేడుక కూడా చేశారు. ఇక రీ–యూనియన్‌కి ఈసారి ఈ ఇల్లే వేదిక అయింది. వచ్చే నెలలో ఈ పార్టీ జరగనుంది. హోస్ట్‌గా ఈ పార్టీని భారీగా చేయడానికి చిరంజీవి ప్లాన్‌ చేస్తున్నారు.