CM Jagan – Chiru: సినీ పెద్దలతో కలిసి రమ్మంటూ మెగాస్టార్‌కు సీఎం జగన్ ఆహ్వానం

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందింది. సినీ పెద్దలతో కలిసి వచ్చి సీఎంను కలవమన్నట్లు పేర్ని నాని ఫోన్ లో చెప్పారు.

Tollywood Meet

CM Jagan – Chiru: టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందింది. సినీ పెద్దలతో కలిసి వచ్చి సీఎంను కలవమన్నట్లు పేర్ని నాని ఫోన్ లో చెప్పారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టిక్కెట్ రేట్లు, సినీ కార్మికుల బతుకుదెరువు, థియేటర్ సమస్యలు లాంటి కీలక సమస్యలపై చర్చించేందుకు రమ్మన్నట్లుగా సమాచారం.

గ‌తంలోనూ సినీరంగం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు మంత్రి పేర్నినాని చొర‌వ తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహా మేరకు ఆగష్టు నెలాఖరులో కలవాలని చిరు బృందం సిద్ధమవుతుంది. కొద్ది రోజులుగా మా అసోసియేషన్ ఎన్నికల గురించి సినీ ఇండస్ట్రీలో దుమారం రేగుతుండగా.. ప్రస్తుత సమావేశంలో ఆ విషయంపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

లాక్‌డౌన్ తర్వాత ఇండస్ట్రీ పనులు ప్రారంభించినా.. థియేటర్లు పూర్తిగా పనిచేస్తుండకపోవడంతో నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. అదే కాకుండా చిన్నపాటి ఆర్టిస్టుల మనుగడకు ఇబ్బంది అవుతుండటంతో సినీ పెద్దల చొరవ కోసం ఎదురుచూస్తున్నారు.