CM Reavanth Reddy Announce Huge Amount to Gaddar Foundation from Telangana Government
Gaddar : నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గద్దర్ ఫౌండేషన్ కి తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 1 ద్వారా మూడు కోట్ల రూపాయలు ప్రకటించారు.
మూడు కోట్ల రూపాయల చెక్ ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ తనయుడు సూర్య కిరణ్ గద్దర్ అందుకున్నారు. అనంతరం గద్దర్ ఫౌండేషన్ కు సహాయం చేసినందుకు కాను గద్దర్ తనయుడు సూర్య కిరణ్ గద్దర్ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.