Vijay Deverakonda : కాంతారావు అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. గద్దర్ అవార్డు వేడుకల్లో విజయ్ దేవరకొండ స్పీచ్..

నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విజయదేవరకొండ కాంతారావు అవార్డుని అందుకున్నారు.

Vijay Deverakonda : కాంతారావు అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. గద్దర్ అవార్డు వేడుకల్లో విజయ్ దేవరకొండ స్పీచ్..

Vijay Deverakonda Received Kantharao Award in Telangana Gaddar Film Awards

Updated On : June 14, 2025 / 10:21 PM IST

Vijay Deverakonda : నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను కాంతారావు అవార్డుని నటుడు విజయ్ దేవరకొండకు ప్రకటించారు.

నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విజయదేవరకొండ కాంతారావు అవార్డుని అందుకున్నారు.

Also Read : Balakrishna : గద్దర్ అవార్డుల వేడుకల్లో బాలయ్య స్పీచ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకొని..

అవార్డు అందుకున్న అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. గద్దరన్న పేరు మీద ఈ అవార్డ్స్ మొదలుపెట్టడం, సినిమా వాళ్ళందర్నీ ఒకదగ్గరికి తీసుకొచ్చి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే గర్వమైన క్షణం నాకు. మహబూబ్ నగర్ లో పుట్టిన పిల్లాడ్ని నేను. నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద అవార్డు ఇవ్వడం ఆయనకు నివాళి. ఆ అవార్డు తీసుకుంటున్న మొదటి వ్యక్తి నేనే. ఈ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా చేయాలి అనుకుంటున్నా. ఈ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం, దిల్ రాజు గారికి ధన్యవాదాలు అని తెలిపారు.

Also Read : Allu Arjun : రేవంత్ రెడ్డి అన్న అంటూ.. అల్లు అర్జున్ స్పీచ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు తీసుకొని..