Balakrishna : గద్దర్ అవార్డుల వేడుకల్లో బాలయ్య స్పీచ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకొని..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డుని అందుకున్నారు.

Balakrishna Speech in Telangana Gaddar Film Awards Event After Receiving NTR National Award
Balakrishna : నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని నటుడు బాలకృష్ణకు ప్రకటించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డుని అందుకున్నారు.
అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరుమీద అవార్డులు ఇవ్వడం సంతోషకరం. గద్దర్ అవార్డుల సమయంలో నాకు ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మొదటిసారి ఈ అవార్డు నాకు ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవార్డుకు ఇచ్చిన డబ్బులు నా బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఇస్తున్నాను అంటూ తన తండ్రి ఎన్టీఆర్ గారిని పొగిడారు. అలాగే చివర్లో జై తెలంగాణ అంటూ ముగించారు.