Balakrishna : గద్దర్ అవార్డుల వేడుకల్లో బాలయ్య స్పీచ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకొని..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డుని అందుకున్నారు.

Balakrishna Speech in Telangana Gaddar Film Awards Event After Receiving NTR National Award

Balakrishna : నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని నటుడు బాలకృష్ణకు ప్రకటించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డుని అందుకున్నారు.

Also Read : Allu Arjun : రేవంత్ రెడ్డి అన్న అంటూ.. అల్లు అర్జున్ స్పీచ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు తీసుకొని..

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరుమీద అవార్డులు ఇవ్వడం సంతోషకరం. గద్దర్ అవార్డుల సమయంలో నాకు ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మొదటిసారి ఈ అవార్డు నాకు ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవార్డుకు ఇచ్చిన డబ్బులు నా బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఇస్తున్నాను అంటూ తన తండ్రి ఎన్టీఆర్ గారిని పొగిడారు. అలాగే చివర్లో జై తెలంగాణ అంటూ ముగించారు.

Also Read : Gaddar Jury Members : గద్దర్ అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి కూడా అవార్డులతో సత్కారం.. జ్యూరీలో ఎవరెవరు ఉన్నారంటే..