Gaddar Jury Members : గద్దర్ అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి కూడా అవార్డులతో సత్కారం.. జ్యూరీలో ఎవరెవరు ఉన్నారంటే..

అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ వీళ్ళే..

Gaddar Jury Members : గద్దర్ అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి కూడా అవార్డులతో సత్కారం.. జ్యూరీలో ఎవరెవరు ఉన్నారంటే..

Telangana Gaddar Film Awards Jury Members Received Awards

Updated On : June 14, 2025 / 9:08 PM IST

Gaddar Jury Members : నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే అవార్డులను గెలుచుకున్నవారికి మాత్రమే కాకుండా ఈ అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి కూడా గద్దర్ అవార్డు ఇచ్చి సత్కరించారు.

జ్యూరీ మెంబర్స్ కి గోల్డెన్ మెమెంటోతో పాటు కొంత పారితోషికం ఇచ్చారు. అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ వీళ్ళే..

Also Read : Gaddar : గద్దర్ ఫౌండేషన్ కి మూడు కోట్లు మంజూరు..

నటుడు మురళి మోహన్, డైరెక్టర్ దశరథ్, నిర్మాత డీవీకే రాజు, నటి ఊహ, ఉమా మహేశ్వరరావు, వనజ ఉదయ్, కూచిపూడి వెంకట్, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, నటి జయసుధ, విజయ్ కుమార్ రావు, జర్నలిస్ట్ లక్ష్మి నారాయణ, శ్రీనాథ్, డా. ఆకునూరి గౌతమ్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, డైరెక్టర్ శివ నాగేశ్వరరావు, డైరెక్టర్ విఎన్ ఆదిత్య, జర్నలిస్ట్
వెంకట రమణ జీవి, నిర్మాత ఏడిద రాజా ఉన్నారు.

అలాగే వీరితో పాటు పుస్తకాలకు సంబంధించిన అవార్డుల ఎంపిక లో జ్యూరీ మెంబర్స్ అయిన భగీరథ ఉత్తమ, వడ్లమాని కనకదుర్గ, మధుసూదన్, డా.హరీష్ TFDC ఎండి, విజయలక్ష్మి లకు కూడా అవార్డులు అందించారు.

Also See : అమ్మతో కలిసి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో..