Allu Arjun : రేవంత్ రెడ్డి అన్న అంటూ.. అల్లు అర్జున్ స్పీచ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు తీసుకొని..

నేడు అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరయి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

Allu Arjun : రేవంత్ రెడ్డి అన్న అంటూ.. అల్లు అర్జున్ స్పీచ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు తీసుకొని..

Allu Arjun Received Telangana Gaddar Film Award for Best Actor in Pushpa 2 from CM Revanth Reddy

Updated On : June 14, 2025 / 9:40 PM IST

Allu Arjun : నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడు అవార్డును పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ ని ప్రకటించారు.

నేడు అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరయి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ వేదికపై మాట్లాడారు.

Also Read : Gaddar Jury Members : గద్దర్ అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి కూడా అవార్డులతో సత్కారం.. జ్యూరీలో ఎవరెవరు ఉన్నారంటే..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. థ్యాంక్యూ గద్దర్ అవార్డు ఇచ్చినందుకు. ఈ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టినందుకు థ్యాంక్యూ. మా రేవంత్ రెడ్డి అన్నగారికి థ్యాంక్యూ. డిప్యూటీ సీఎం, దిల్ రాజు గారికి కూడా థ్యాంక్యూ. నా డైరెక్టర్ సుకుమార్ లేకుండా ఇది పాజివుల్ అవ్వదు. ఇది నీ కష్టం. నా నిర్మాతలకు, నాతో పనిచేసిన అందరికి, పుష్పకి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆయన ఆ రోజు హిందీలో సినిమా రిలీజ్ చేయమని చెప్పకపోయి ఉంటే ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. పుష్ప 2 కి నాకు వచ్చిన మొదటి అవార్డు ఇది. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. నా ఫ్యాన్స్ అందరికి ఈ అవార్డు అంకితం. నా ఆర్మీ లవ్ యు. ఈ అవార్డులు ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ. జై తెలంగాణ జై హింద్ అని చెప్పి చివర్లో పుష్ప 2 సినిమా నుంచి డైలాగ్ చెప్పారు.

Also See : అమ్మతో కలిసి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో..