CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై చేసిన ప్రకటనతో టాలీవుడ్ మొత్తం షేక్ అయింది. ముఖ్యంగా పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలకు షాక్ ఇచ్చినట్టయింది. ఇక నుండి బెనిఫిట్ షోలు ఉండవు, టిక్కెట్ రేట్స్ పెంచమని, అది కూడా తాను సీఎంగా ఉన్నాన్ని రోజులు అసలు జరగదని సీఎం చేసిన ప్రకటన సినీ పరిశ్రమపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. పెద్ద హీరోల రెమ్యూనరేషన్స్, కలెక్షన్స్ పై తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు. అంతే కాదు నిర్మాతలకు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించే వాళ్లకు ఇది గట్టి దెబ్బంటున్నారు.
తెలంగాణలో పెద్ద సినిమా రిలీజ్ అయితే వారం రోజుల దాక టి్కెట్ రేట్లు పెంచుకుంటారు. సింగిల్ స్క్రిన్ 150 రూపాయిలుంటే 50 శాతం పెంచుకోవడానికి పర్మిషన్ వారం రోజుల వరకు వుంటుంది. అంటే 150+75 = 225 రూపాయిలు. అదే మల్టీప్లెక్స్ అయితే 295 రూపాయిలు వుంటే 445 రూపాయిలు వరకు పెరుగుతుంది. చాలా ఏరియాల్లో ఇక్కడ సింగిల్ స్ర్కిన్ థియేటర్లో, మల్టీప్లెక్స్ థియేటర్లో రేట్లు వేరు వేరుగా కూడ ఉంటాయి. సుదర్మన్ థియేటర్లో 150 వుంటే సిటీ అవుట్ కట్స్ థియేటర్లో 100 రూపాయిలే వుంటుంది. కాబట్టి కలెక్షన్స్ లో కూడ తేడా వుంటుంది. అయితే ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెంచకపోతే పెద్ద సినిమాలకు వారం రోజులకు కలిపి దాదాపు 20 కోట్ల దాక నష్టం వస్తుందంటున్నారు. వారం రోజుల తర్వాత ఎలాగో సాధారణ టిక్కెట్ రే్ట్లే ఉంటాయి.
Also Read : Mohan Babu : మోహన్ బాబు పై కేసు నమోదు చేసాం.. వాళ్ళది ఇంటి సమస్య.. తెలంగాణ డీజీపీ కామెంట్స్..
నైజాంలో సినిమా టిక్కెట్ రేట్లు పెంచకపోతే ఫస్ట్ డే 2కోట్ల 50 లక్షల దాకా కలెక్షన్స్ తగ్గుతాయంటున్నారు. అంటే 10 కోట్లు రావాలసింది 7.50 కోట్లే వస్తాయంటున్నారు. ఇలా వారం రోజులకు దాదాపు 20 కోట్ల వరకు కలెక్షన్స్ తగ్గొచ్చు అంటున్నారు. ఇప్పుడు సంక్రాంతికి వచ్చే మూడు పెద్ద సినిమాలు గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలకు వారం రోజులకు దాదాపు 20 కోట్టు దాకా తగ్గినట్టే అంటున్నారు.
అయితే దీనికి ఇంకో వర్షన్ లో టిక్కట్ రేట్లు తగ్గించటం వల్ల పెద్ద నష్టం కూడ లేదంటున్నారు. కాకపోతే హీరోలు, ఫ్యాన్స్ తమ కలెక్షన్స్ ఫిగర్ గురించి చెప్పుకోవడానికి ఇబ్బందంటున్నారు. అయితే ఇక్కడ మరో మాట కూడ వినిపిస్తుంది. ఇక ముందు ముందు పెద్ద సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు, హీరోలు బడ్జెట్ కంట్రోల్ తప్పకుండా పాటిస్తారంటున్నారు. హీరోలు రెమ్యూనరేషన్స్ పెంచమని అడిగేది తమకు వస్తున్న కలెక్షన్స్ బట్టే కాబట్టి ఇక నుండి హీరోలు పెంచమని అడగరంటున్నారు. మరోవైపు నిర్మాతలు, డైరెక్టర్స్ కూడ బబ్జెట్ కంట్రోల్ పాటిస్తారంటున్నారు. ఏది ఏమైనా సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం పెద్ద హీరోలు, నిర్మాతలకు మాత్రం షాక్ ఇచ్చింది అని టాలీవుడ్ అభిప్రాయపడుతోంది.