Mohan Babu : మోహన్ బాబు పై‌ కేసు నమోదు చేసాం.. వాళ్ళది ఇంటి సమస్య.. తెలంగాణ డీజీపీ కామెంట్స్..

తాజాగా ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు.

Mohan Babu : మోహన్ బాబు పై‌ కేసు నమోదు చేసాం.. వాళ్ళది ఇంటి సమస్య.. తెలంగాణ డీజీపీ కామెంట్స్..

Telangana DGP Comments on Manchu Mohan Babu Family Issue

Updated On : December 22, 2024 / 1:35 PM IST

Mohan Babu : ఇటీవల మంచు కుటుంబంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేసారు. తనపై దాడి చేసారని పోలీసులకు కంప్లైంట్ కూడా చేసారు. ఇదే క్రమంలో మోహన్ బాబు కూడా మంచు మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ వివాదంలో పలువురు జర్నలిస్టులు మోహన్ బాబు ఇంటికి వెళ్లగా ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : Telangana DGP – Allu Arjun : అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు.. హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం..

తాజాగా ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణ డీజీపీ మాట్లాడుతూ.. మోహన్ బాబు వాళ్ళది కుటుంబ సమస్య. వాళ్ళు వాళ్లు మాట్లాడుకుంటే పర్వాలేదు. ఇంటి సమస్య కాబట్టి వాళ్లే పరిష్కరించుకోవాలి. ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మీడియా ప్రతినిధుల దాడుల నేఫధ్యంలో లా ప్రకారం మోహన్ బాబు మీద యాక్షన్ ఉంటుంది అని అన్నారు. మరి దీనిపై మంచు కుటుంబంలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.