Color Photo Fame Suhas have almost six movies as Hero and ten Movies as Character artist
Suhas Movies : షార్ట్ ఫిలిమ్స్(Short Films) తో మొదలు పెట్టి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ కలర్ ఫోటో(Color Photo) సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు సుహాస్(Suhas). ఆ సినిమా సుహాస్ లైఫ్ నే మార్చేసింది. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న సుహాస్ కి కలర్ ఫోటో సినిమాతో బ్రేక్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. అంతేకాక హీరోగా కూడా అనేక ఆఫర్స్ వచ్చాయి.
నిన్న శనివారం ఆగస్టు 19 సుహాస్ పుట్టిన రోజు కావడంతో సుహాస్ హీరోగా చేస్తున్న సినిమాల నుంచి విషెస్ చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. దీంతో సుహాస్ చేతిలో హీరోగా ఇన్ని సినిమాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు అంతా. కలర్ ఫోటో తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే హీరోగా కూడా చేస్తున్నాడు. ఇటీవల రైటర్ పద్మభూషణ్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సినిమా మూడు కోట్లతో తీస్తే ఏకంగా 10 కోట్లు కలెక్ట్ చేసింది. తక్కువ బడ్జెట్ పెట్టి మంచి మంచి కథలతో సుహాస్ ని హీరోగా సినిమాలు తీస్తే కచ్చితంగా హిట్ అవుతుంది, లాభాలు కూడా వస్తాయని నిర్మాతలు సుహాస్ కి హీరోగా సినిమాలు ఆఫర్స్ చేస్తున్నారు.
Dulquer Salmaan : సోనమ్ కపూర్ పై రానా వ్యాఖ్యలు.. స్పందించిన దుల్కర్ సల్మాన్..
ఇక సుహాస్ కూడా కొత్త కొత్త కథలతో ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు సుహాస్ చేతిలో హీరోగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ప్రసన్న వదనం, ఆనందరావు అడ్వాంచర్స్, కేబుల్ రెడ్డి, గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు.. సినిమాలు ఉన్నాయి. ఏకంగా ఆరు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోల చేతిలో కూడా ఇన్ని ప్రాజెక్ట్స్ లేవు. సుహాస్ సినిమా టైటిల్స్ కూడా చాలా కొత్తగా ఉంటున్నాయి. ఇవే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరో పది సినిమాలు చేతిలో ఉన్నట్టు సమాచారం. దీంతో సుహాస్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.