Comedian Ali : మరోసారి పెళ్లి చేసుకున్న కమెడియన్ అలీ.. వీడియో వైరల్.. దగ్గరుండి పెళ్లి చేసిన కూతుళ్ళు..

అలీ తాజాగా మరోసారి పెళ్లి చేసుకున్నాడు.

Comedian Ali Married Again with his Wife Zubeda on their Wedding Anniversary

Comedian Ali : టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆల్మోస్ట్ 1000 కి పైగా సినిమాలు చేసేసి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. గత కొంతకాలంగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు అలీ. సినిమాలతో పాటు కొన్ని రోజుల వరకు కూడా పలు టీవీ షోలు, పాలిటిక్స్ లో కూడా బిజీగానే ఉన్నారు. అలీ భార్య జుబేదా అలీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.

అయితే అలీ తాజాగా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య జుబేదానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆల్మోస్ట్ తన పెళ్లి అయి 30 ఏళ్ళు దాటింది. ఇటీవల అలీ పెళ్లి రోజుని తన కూతుళ్లు దగ్గరుండి మరీ ఘనంగా చేసారు. ముస్లిం వివాహ పద్దతిలో అన్ని వేడుకలను కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా అలీ – జుబేదా పెళ్లి చేసారు వారి పిల్లలు. ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోని తాజాగా జుబేదా తన యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Also Read : Nayanthara : ధనుష్ విషయంలో నయనతారకు, నెట్ ఫ్లిక్స్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..

ఈ వీడియోలో ఇద్దరు కూతుళ్లు తమ తల్లితండుల పెళ్లి రోజున మళ్ళీ వారికి పెళ్లి చేస్తున్నట్టు, వారి సంప్రదాయంలో పెళ్లి జరిపిస్తున్నట్టు తెలిపారు. హల్దీ వేడుకలు, మెహందీ, రిసెప్షన్, వారి సాంప్రదాయం ప్రకారం నిఖా.. ఇలా అన్ని వేడుకలను నిర్వహించారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

Also Read : Rajamouli : మహేష్, ప్రియాంకతో సహా.. వాళ్ళందరి దగ్గర.. ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు తీసుకున్న రాజమౌళి?

ఇక అలీ కొంతకాలం కిందట రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు, టీవీ షోలలో కనిపిస్తున్నారు. అలీకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు ఫాతిమాకు ఇటీవల పెళ్లి చేశారు అలీ.