Sapthagiri : క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఇంట్లో తీవ్ర విషాదం..

క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది.

Comedian Saptagiri Mother passed away

టాలీవుడ్ క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న త‌ల్లి చిట్టెమ్మ క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌ప్త‌గిరి వెల్ల‌డించారు. మిస్ యు అమ్మ అంటూ ఎమోషనల్ అయ్యారు.

బుధ‌వారం (ఏప్రిల్ 9న‌) ఆమె అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. కాగా.. చిట్టెమ్మ గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పోరాడుతోంది. క్ర‌మంలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మంగ‌ళ‌వారం తుది శ్వాస విడిచింది.

సప్తగిరి తల్లి ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్ర‌ముఖ‌లు, నెటిజన్లు స‌ప్త‌గిరికి త‌మ ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.

Allu Arjun – Atlee : అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా? వాళ్లిద్దరూ కాకుండా..

స‌ప్త‌గిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. బొమ్మరిల్లు చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభిండు. పరుగు, గబ్బర్ సింగ్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, సలార్ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆత‌రువాత హీరోగా ప‌లు సినిమాల‌ను తీశారు. రీసెంట్ గా ‘పెళ్లికాని ప్రసాద్’ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.